Telegram CEO Arrest: టెలిగ్రామ్ సీఈవో వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన ప్రపంచం.!
టెలిగ్రామ్ యాప్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ అరెస్టయ్యారు. తన ప్రైవేటు జెట్‌లో అజర్ బైజాన్ నుంచి పారిస్‌లోని లే బోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను శనివారం రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 39 ఏళ్ల ఈ బిలియనీర్‌ను కోర్టులో హాజరు పరచనున్నారు. తనపై అరెస్ట్ వారెంట్ ఉన్నప్పటికీ పావెల్ పారిస్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పావెల్ అరెస్ట్‌పై టెలిగ్రాం ఇప్పటి వరకు స్పందించలేదు.
టెలిగ్రామ్ యాప్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ అరెస్టయ్యారు. తన ప్రైవేటు జెట్‌లో అజర్ బైజాన్ నుంచి పారిస్‌లోని లే బోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను శనివారం రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 39 ఏళ్ల ఈ బిలియనీర్‌ను కోర్టులో హాజరు పరచనున్నారు. తనపై అరెస్ట్ వారెంట్ ఉన్నప్పటికీ పావెల్ పారిస్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పావెల్ అరెస్ట్‌పై టెలిగ్రాం ఇప్పటి వరకు స్పందించలేదు. 15.5 బిలియన్ డాలర్ల సంపద కలిగిన దురోవ్ 2014లో రష్యాను విడిచిపెట్టారు. ఆయన తన సోదరుడు నికోలాయ్‌తో కలిసి 2013లో టెలిగ్రామ్ యాప్‌ను తీసుకొచ్చారు. దీనికిప్పుడు ప్రపంచవ్యాప్తంగా 900 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. రష్యాలో పుట్టిన పావెల్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. ఆయనకు ఫ్రాన్స్, యూఏఈ పౌరసత్వాలు ఉన్నాయి. ఆయనపై మోసం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలను ప్రోత్సహించడం వంటి అభియోగాలున్నాయి. ఆయనపై గతంలోనే ఫ్రాన్స్‌లో అరెస్ట్ వారెంట్ జారీ కాగా, తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

