వినూత్నమైన మగాళ్ల పండుగను అన్నమయ్య జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగలో మహిళలకు ప్రవేశం ఉండదు. ప్రతియేటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారంరోజు నాడు తిప్పాయపల్లె శ్రీ సంజీవరాజ స్వామి పొంగళ్ల పండగను నిర్వహించడం పరిపాటిగా వస్తోంది.