కరువు కోరల్లో నమీబియా.. 83 ఏనుగులను వధించి ??
ప్రజలకు ఆహారం అందించేందుకు గాను 83 ఏనుగులు, 30 నీటి గుర్రాలు , 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 100 బ్లూవైల్డ్ బీస్ట్‌లు, 300 జీబ్రాలను వధించాలని నిర్ణయించినట్టు వెల్లడించాయి. వీటి సంఖ్య అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో తగినన్ని ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయా శాఖలు పేర్కొన్నాయి. నిపుణులైన వేటగాళ్ల సాయంతో వీటిని వధించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాయి.
ప్రజలకు ఆహారం అందించేందుకు గాను 83 ఏనుగులు, 30 నీటి గుర్రాలు , 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 100 బ్లూవైల్డ్ బీస్ట్‌లు, 300 జీబ్రాలను వధించాలని నిర్ణయించినట్టు వెల్లడించాయి. వీటి సంఖ్య అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో తగినన్ని ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయా శాఖలు పేర్కొన్నాయి. నిపుణులైన వేటగాళ్ల సాయంతో వీటిని వధించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాయి. నైరుతి ఆఫ్రికాలో కరవు ప్రాంతాల్లోని ప్రజలకు సాయపడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించాయి. ఈ ఏడాది కరవు తీవ్రత ఎక్కువగా ఉండటంతో నమీబియాలో దాదాపు 14,00,000 మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సంఖ్య మొత్తం దేశ జనాభాలో సగానికి సమానం. ఈ భారీ ప్రాణుల సంఖ్యను తగ్గిస్తే నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దీనికితోడు కరవు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాణులు జనావాసాలపై పడటం ఎక్కువైందని ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో 83 ఏనుగులను గుర్తించామని పేర్కొంది. వీటి మాంసాన్ని కరవు సహాయక కార్యక్రమాల్లో భాగంగా పంపిణీ చేస్తామని వెల్లడించింది. ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఏనుగుల సంఖ్య 2,00,000కుపైగా ఉంది. ఈ ప్రాణులు కరవు బారినపడి నీరు దొరక్క గతేడాది భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. బోట్సువానాలో 1,30,000 ఏనుగులు ఉన్నాయి. 2014లో వీటి వేటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. కానీ, స్థానికులు తీవ్రమైన ఒత్తిడి చేయడంతో 2019లో తొలగించింది. ఇప్పుడు వార్షిక వేట కోటాను ప్రభుత్వం నిర్ణయించి అనుమతులు జారీ చేస్తోంది. స్థానికులకు అది ప్రధాన ఆదాయవనరుగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇడ్లీ, దోశలు తింటే బరువు పెరుగుతారని భయమా ?? ఇది మీ కోసమే !!
తిరుమల లడ్డూకీ ఆధార్ లింక్.. టీటీడీ నిర్ణయంపై భక్తుల అసంతృప్తి
అంబానీని వెనక్కు నెట్టిన అదానీ.. భారత కుబేరుల లిస్ట్‌లో షారూఖ్ ఖాన్