Male Chromosome: అంతరించిపోతున్న మగవారి వై క్రోమోజోమ్‌.! దీనికి కారణం ఏంటి.?

ఆడా మగా కలిస్తేనే సృష్టి. మరి మగవాళ్లు అసలు ఆనవాళ్లే లేకుండా పోతే? పురుషజాతి పూర్తిగా అంతరించిపోతే? అలాంటి సృష్టి వైపరీత్యమే దాపురించబోతోంది! కాకపోతే ఇప్పుడప్పుడే కాదు. ఓ కోటి సంవత్సరాల తర్వాత! అప్పటికల్లా మగవాళ్లలోని వై క్రోమోజోమ్‌ పూర్తిగా మటుమాయం కానుండటమే ఇందుకు కారణం! నిజానికి జీవ పరిణామ క్రమంలో వై క్రోమోజోమ్‌ క్రమంగా చిక్కిపోతూ వస్తుందట.

Male Chromosome: అంతరించిపోతున్న మగవారి వై క్రోమోజోమ్‌.! దీనికి కారణం ఏంటి.?

|

Updated on: Sep 02, 2024 | 11:31 AM

ఆడా మగా కలిస్తేనే సృష్టి. మరి మగవాళ్లు అసలు ఆనవాళ్లే లేకుండా పోతే? పురుషజాతి పూర్తిగా అంతరించిపోతే? అలాంటి సృష్టి వైపరీత్యమే దాపురించబోతోంది! కాకపోతే ఇప్పుడప్పుడే కాదు. ఓ కోటి సంవత్సరాల తర్వాత! అప్పటికల్లా మగవాళ్లలోని వై క్రోమోజోమ్‌ పూర్తిగా మటుమాయం కానుండటమే ఇందుకు కారణం! నిజానికి జీవ పరిణామ క్రమంలో వై క్రోమోజోమ్‌ క్రమంగా చిక్కిపోతూ వస్తుందట. అలా గత 30 కోట్ల ఏళ్లుగా అది ఏకంగా 95 శాతానికి పైగా కృశించిపోయినట్టు సైంటిస్టులు తేల్చడం విశేషం!! ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మగవారి పుట్టుకకు కారణమయ్యే వై క్రోమోజోమ్‌ను మరో కోటి ఏళ్ల తర్వాత మనం పూర్తిగా మర్చిపోవాల్సిందేనని వాళ్లు హెచ్చరిస్తున్నారు.

ఎక్స్, వై క్రోమోజోమ్‌లు లింగ నిర్ధారణ కారకాలన్నది తెలిసిందే. అందుకే వాటిని సెక్స్‌ క్రోమోజోములుగా పిలుస్తారు. ఆడవాళ్లలో రెండు ఎక్స్‌ క్రోమోజోములు, మగవారిలో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్‌ ఉంటాయి. వై క్రోమోజోమ్‌ వల్ల వృషణాలు తదితర కీలక పురుష పునరుత్పాదక అవయవాలు అభివృద్ధి చెందుతాయి. అందుకే దాన్ని మేల్‌ క్రోమోజోమ్‌గా, ఎక్స్‌ను ఫీమేల్‌ క్రోమోజోమ్‌గా పిలుస్తారు. ఫలదీకరణ వేళ రెండు ఎక్స్‌ క్రోమోజోములు కలిస్తే అమ్మాయి, ఎక్స్, వై క్రోమోజోములు కలయికతో అబ్బాయి పుడతారు.

ఎక్స్‌తో పోలిస్తే పరిమాణంలోనే గాక జన్యువుల సంఖ్యలో కూడా వై క్రోమోజోమే చిన్నది. అందులో ఒకప్పుడు 1,438 జన్యువులుండేవట. గత 30 కోట్ల ఏళ్లలో వాటిలో ఏకంగా 1,393 జీన్స్‌ లుప్తమైపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. ప్రస్తుతం మిగిలి ఉన్న 45 జన్యువులు కూడా మరో కోటి ఏళ్లలో పూర్తిగా లుప్తమవుతాయని జెనెటిక్స్‌ ప్రొఫెసర్, సైంటిస్టు జెన్నిఫర్‌ మార్షల్‌ గ్రేవ్స్‌ వివరించారు. ఈ పరిశోధన వివరాలను నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్స్‌లో ప్రచురించారు.

అయితే వై క్రోమోజోమ్‌ అంతరించినా మగ జాతి మనుగడకు ముప్పేమీ ఉండకపోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. దాని స్థానంలో అవే లక్షణాలతో కూడిన కొత్త మేల్‌ క్రోమోజోమ్‌ అభివృద్ధి చెందే ఆస్కారం పుష్కలంగా ఉన్నట్టు జపాన్‌లోని హక్కైడో వర్సిటీ పరిశోధక బృందం చెప్పుకొచ్చింది. ఒక రకం చిట్టెలుకల్లో ఇలాగే జరిగిందనీ వై క్రోమోజోమ్‌ లుప్తమైపోయినా దానిలోని మేల్‌ జీన్స్‌ ఇతర క్రోమోజోముల్లోకి చేరాయి అని వివరించింది. కనుక వై క్రోమోజోమ్‌ క్షీణించినా దానికి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకునే సామర్థ్యం క్షీరదాల్లో ఉంటుందని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
రోగికి ‘అదుర్స్‌’ సినిమా చూపిస్తూ.. మెదడులోని కణితి తొలగింపు
రోగికి ‘అదుర్స్‌’ సినిమా చూపిస్తూ.. మెదడులోని కణితి తొలగింపు
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..శుభవార్త ఎలా చెప్పిందో చూశారా?
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..శుభవార్త ఎలా చెప్పిందో చూశారా?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..