Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబానీని వెనక్కు నెట్టిన అదానీ.. భారత కుబేరుల లిస్ట్‌లో షారూఖ్‌ ఖాన్‌

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ భారత అపర కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీని వెనక్కు నెట్టి మొదటి స్థానం దక్కించుకున్నారు. ఈమేరకు హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ను వెలువరించింది. గత ఐదేళ్లుగా దేశంలో బిలియనీర్లు పెరుగుతున్నారని నివేదిక పేర్కొంది. దేశంలో మొత్తం 334 మంది బిలియనీర్లు ఉన్నారని, ఏడాదిలో 29 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది.

Follow us
Phani CH

|

Updated on: Sep 02, 2024 | 8:31 PM

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ భారత అపర కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీని వెనక్కు నెట్టి మొదటి స్థానం దక్కించుకున్నారు. ఈమేరకు హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ను వెలువరించింది. గత ఐదేళ్లుగా దేశంలో బిలియనీర్లు పెరుగుతున్నారని నివేదిక పేర్కొంది. దేశంలో మొత్తం 334 మంది బిలియనీర్లు ఉన్నారని, ఏడాదిలో 29 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. అదే సమయంలో చైనాలో వీరి సంఖ్య 25 శాతం మేర తగ్గిందని పేర్కొంది. జులై 31 నాటి గణాంకాలను ఆధారంగా చేసుకొని ఈ నివేదికను రూపొందించింది. హురూన్‌ ఇండియా వెలువరించిన జాబితాలో రూ.11.61 లక్షల కోట్ల సంపదతో అదానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద ఏకంగా 95 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. రూ.10.14 లక్షల కోట్లతో అంబానీ రెండో స్థానంలో నిలిచారు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధినేత శివ్‌నాడార్‌, ఆయన కుటుంబం రూ.3.14 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత సైరస్‌ పూనావాలా, సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ నాలుగైదు స్థానాలు దక్కించుకున్నారు. కుమార మంగళం బిర్లా, గోపీచంద్‌ హిందుజా, రాధాకృష్ణ దమానీ, అజీమ్‌ ప్రేమ్‌జీ, నీరజ్‌ బజాజ్‌ టాప్‌-10 జాబితాలో నిలిచారు. ఇక బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కూడా ఈ రిచ్‌ లిస్ట్‌లో స్థానం సంపాదించారు. ఆయన సంపద రూ.7,300 కోట్లుగా నివేదిక పేర్కొంది. షారుక్‌ సంపద పెరుగుదలలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌లోని వాటాలు, తన సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కీలక భూమిక పోషించాయని నివేదిక తెలిపింది. సినీ ప్రముఖుల విషయంలో జుహీ చావ్లా, హృతిక్‌ రోషన్‌, అమితాబ్‌, కరణ్‌ జోహార్‌ టాప్‌-5లో నిలిచారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొరపాటున పూజారి అకౌంట్​లోకి రూ. కోటిన్నర.. తరువాత..

Rahul Gandhi: మార్షల్ ఆర్ట్స్‌ను ఇరగదీసిన రాహుల్ గాంధీ

సెట్ టాప్‌ బాక్స్‌ కోసం జియో టీవీ ఓఎస్‌ !! కాల్‌లోనే AI సేవలు

జియో యూజర్లకు బంపర్ ఆఫర్ !! వెల్‌కమ్ ఆఫర్‌ కింద 100 జీబీ ఉచిత స్టోరేజీ

Vishal: మహిళల్ని వక్ర దృష్టితో చూసేవారికి శిక్ష పడాలి

సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా..
సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా..
రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయ్యే రాశుల వారు వీరే!
రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయ్యే రాశుల వారు వీరే!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్.. అసలు దొంగను పట్టించిన మంగళసూత్రం
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్.. అసలు దొంగను పట్టించిన మంగళసూత్రం
మరో వారం రోజుల్లో అదృష్టంపట్టబోయే రాశులు ఇవే..మీ రాశి ఉందా మరి!
మరో వారం రోజుల్లో అదృష్టంపట్టబోయే రాశులు ఇవే..మీ రాశి ఉందా మరి!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగానే..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగానే..
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా వదలట్లేదు..వెలుగులోకి కొత్త స్కామ్
అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా వదలట్లేదు..వెలుగులోకి కొత్త స్కామ్
కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్..
కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్..
అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?