పొరపాటున పూజారి అకౌంట్లోకి రూ. కోటిన్నర.. తరువాత..
ఈ మధ్య కాలంలో బ్యాంకు లేదా ఎవరైనా వ్యక్తులు పొరపాటున గుర్తు తెలియని వ్యక్తి అకౌంట్‌ల్లోకి నగదు జమ చేయడం చూస్తున్నాం. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ పూజారి అకౌంట్లోకి కూడా అలా సుమారు కోటిన్నర రూపాయలు జమ అయ్యాయి. దీంతో షాక్ అయిన పూజారి ఆ డబ్బును 24 గంటల్లోనే తిరిగి ఇచ్చేశాడు. పూజారి చేసిన పనికి అందరూ ప్రశంసిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో బ్యాంకు లేదా ఎవరైనా వ్యక్తులు పొరపాటున గుర్తు తెలియని వ్యక్తి అకౌంట్‌ల్లోకి నగదు జమ చేయడం చూస్తున్నాం. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ పూజారి అకౌంట్లోకి కూడా అలా సుమారు కోటిన్నర రూపాయలు జమ అయ్యాయి. దీంతో షాక్ అయిన పూజారి ఆ డబ్బును 24 గంటల్లోనే తిరిగి ఇచ్చేశాడు. పూజారి చేసిన పనికి అందరూ ప్రశంసిస్తున్నారు. మిర్జాపుర్కు చెందిన మోహిత్ మిశ్ర అనే పూజారి బ్యాంక్ ఖాతాలోకి ఆగస్టు 27న సాయంత్రం రూ.1,48,50,000 జమ అయినట్లు అతడి ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అంత పెద్ద మొత్తాన్ని తన ఖాతాకు ఎవరు వేశారా అని ఆలోచిస్తుండగా తనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మనీ క్యాపిటల్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఉమేశ్ శుక్ల అనే వ్యక్తి ఫోన్ చేసి పొరపాటున నగదు ట్రాన్స్ఫర్ చేశాడని పూజారికి చెప్పాడు. కానీ వెంటనే తిరిగి పంపించడానికి చూస్తే, అప్పటికే బ్యాంకు సమయం దాటిపోయింది. దీంతో తాను 24 గంటల్లో డబ్బులను తిరిగి జమ చేస్తానని అవతలి వ్యక్తికి హామీ ఇచ్చాడు పూజారి. ఆ తర్వాతి రోజు ఉదయం వెళ్లి చెక్కు ద్వారా మొత్తాన్ని తిరిగి జమ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rahul Gandhi: మార్షల్ ఆర్ట్స్‌ను ఇరగదీసిన రాహుల్ గాంధీ
సెట్ టాప్ బాక్స్ కోసం జియో టీవీ ఓఎస్ !! కాల్‌లోనే AI సేవలు
జియో యూజర్లకు బంపర్ ఆఫర్ !! వెల్‌కమ్ ఆఫర్ కింద 100 జీబీ ఉచిత స్టోరేజీ
Vishal: మహిళల్ని వక్ర దృష్టితో చూసేవారికి శిక్ష పడాలి
నెలన్నరలో ఏడుగురు తోడేళ్లకు బలి !! ఆ గ్రామంలో జరుగుతున్న నరమాంస భక్షక భీభత్సం