అమెరికాను వణికిస్తోన్న ప్రాణాంతక ట్రిపుల్‌ ఈ' వైరస్‌

అమెరికాను వణికిస్తోన్న ప్రాణాంతక “ట్రిపుల్‌ ఈ’ వైరస్‌

Phani CH

|

Updated on: Sep 02, 2024 | 8:55 PM

కరోనా వైరస్‌ కట్టడికి ప్రపంచమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లడం చూశాం. లాక్‌డౌన్‌ విధించాల్సిన తీవ్ర పరిస్థితులు అప్పట్నుంచి ఏ దేశానికి రాలేదు. అయితే దోమకాటు అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్టాన్ని వణికిస్తోంది. ఆ రాష్ట్రాన్ని అరుదైన, ప్రాణాంతక "ట్రిపుల్‌ ఈ' వైరస్‌ భయపెడుతోంది. వైరస్‌ సోకిన న్యూహాంప్‌షైర్‌ నివాసి ఒకరు తాజాగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్‌ కట్టడికి ప్రపంచమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లడం చూశాం. లాక్‌డౌన్‌ విధించాల్సిన తీవ్ర పరిస్థితులు అప్పట్నుంచి ఏ దేశానికి రాలేదు. అయితే దోమకాటు అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్టాన్ని వణికిస్తోంది. ఆ రాష్ట్రాన్ని అరుదైన, ప్రాణాంతక “ట్రిపుల్‌ ఈ’ వైరస్‌ భయపెడుతోంది. వైరస్‌ సోకిన న్యూహాంప్‌షైర్‌ నివాసి ఒకరు తాజాగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 80 ఏళ్ల వృద్ధుడు హాస్పిటల్‌లో లైఫ్‌ సపోర్ట్‌పై కొన ఊపిరితో ఉండటం చర్చనీయాంశంగా మారింది. దాంతో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ముందు జాగ్రత్తగా అక్కడి 5 పట్టణాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ విధించారు. జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, డయేరియా, ఫిట్స్‌ .. ఇవీ లక్షణాలు. దోమ ఇక్కడ కారియర్‌గా పనిచేస్తుంది. దోమ కుట్టడం వల్ల సోకే వైరస్‌ మనిషిని మృత్యువుకు దగ్గర చేస్తుంది. అందుకే ఎవరికి వారే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగం సూచనలు ఇచ్చింది. “ట్రిపుల్‌ ఈ’ వైరస్ కు ఎలాంటి మందూ లేదు. ఈస్టర్న్‌ ఎక్వైన్‌ ఎన్‌సఫలైటిస్‌ అన్నది వైరస్‌ మరో పేరు. వైరస్ సోకిన వారిలో 33 నుంచి 70 శాతం మంది మరణించే అవకాశాలున్నాయని యూఎస్ సెంటర్ ఫర్‌ డిసీజ్ కంట్రోల్‌ సీడీసీ హెచ్చరించింది. ఇన్‌ఫెక్షన్ సోకిన ఇతరుల్లో నరాల సమస్యలు వెంటాడతాయని తెలిపింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దెయ్యాలతో లాంగ్‌ జంప్‌ పోటీలు.. నిర్వహించిన యమధర్మరాజు !!

అభిమానులకు స్వయంగా భోజనం వడ్డించిన స్టార్‌ హీరో