దెయ్యాలతో లాంగ్‌ జంప్‌ పోటీలు.. నిర్వహించిన యమధర్మరాజు !!

అదేదో సినిమాలో చూపించినట్లు యమలోకంలో ఉండాల్సిన యమధర్మరాజు చిత్రగుప్తునితో సహా భూలోకంలో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? యముండా అంటూ మనుషుల ప్రాణాలను పల్లీల పొట్టులెక్క ఊదేసే యముడు భూమిమీద సందడి చేస్తే ఎలా ఉంటుంది. చిత్రగుప్తుడు చిట్టా విప్పుతుండగా మానువుల పాపపుణ్యాలను బేరీజు వేస్తూ శిక్షలు విధించే నరకలోకాధిపతి భూలోకంలో స్పోర్ట్స్‌ కండక్ట్‌ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి ఈ సినిమా స్టోరీ అనుకుంటున్నారా?

దెయ్యాలతో లాంగ్‌ జంప్‌ పోటీలు.. నిర్వహించిన యమధర్మరాజు !!

|

Updated on: Sep 02, 2024 | 8:54 PM

అదేదో సినిమాలో చూపించినట్లు యమలోకంలో ఉండాల్సిన యమధర్మరాజు చిత్రగుప్తునితో సహా భూలోకంలో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? యముండా అంటూ మనుషుల ప్రాణాలను పల్లీల పొట్టులెక్క ఊదేసే యముడు భూమిమీద సందడి చేస్తే ఎలా ఉంటుంది. చిత్రగుప్తుడు చిట్టా విప్పుతుండగా మానువుల పాపపుణ్యాలను బేరీజు వేస్తూ శిక్షలు విధించే నరకలోకాధిపతి భూలోకంలో స్పోర్ట్స్‌ కండక్ట్‌ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి ఈ సినిమా స్టోరీ అనుకుంటున్నారా? కాదండి బాబూ అక్కడ నిజంగానే యముడు ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు లాంగ్‌జంప్‌ స్పోర్ట్స్‌ కూడా కండక్ట్‌ చేశాడు. వినడానికి వింతగానే ఉన్నా చెప్పడానికీ ఆశ్చర్యంగానే ఉంది. రోడ్డుమీద ప్రత్యక్షంగా యముడిని చూసినవారంతా మనం ఎక్కడున్నాం భూమి మీదే ఉన్నామా లేక యమలోకానికి గిన వచ్చామా అని ఫీలయ్యారట. ఈ విచిత్ర దృశ్యం కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని ఉడిపీని, ప్రసిద్ధ మల్పే బీచ్‌ను కలిపే ఆది ఉడిపి-మల్పే రహదారి గుంతలమయంగా మారింది. దీంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరగడంతోపాటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరగడంతో పలువురు గాయపడగా కొందరు మరణించారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఆ గుంతల రోడ్డుపై యముడు లాంగ్‌ జంప్ పోటీలు నిర్వహించాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అభిమానులకు స్వయంగా భోజనం వడ్డించిన స్టార్‌ హీరో

Follow us