Viral Video: ఈ ఏనుగు మరీ స్మార్ట్.. అరటి పండు తినాలంటే తొక్కతీయాల్సిందే.. వీడియో వైరల్..
తెలివైన, విశ్వాసం గల జంతువు కూడా ఏనుగు. అయితే ఏనుగుకి తినేందుకు ఆహారం ఇస్తే.. తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుని చకచకా తినేస్తుంది. కానీ ఓ ఏనుగు మాత్రం నేను అందరికంటే భిన్నం ఇంకా చెప్పాలంటే మనిషికంటే ఏ మాత్రం తక్కువ కాను అనిపించేలా చేస్తోంది.. తనకు అరటి పండు తినడానికి ఇస్తే.. తన తొండంతో అరటి పండు తొక్క తీసి అప్పుడు తిన్నది.

మనిషి వలెనే ఏనుగు కూడా సంఘజీవి. సమూహంగా జీవిస్తాయి. అంతేకాదు.. మనిషిని ప్రేమించే జంతువులో ఏనుగు కూడా ఒకటి. వాస్తవానికి మనిషి జీవిత విధానానికి ఏనుగుల జీవన విధానానికి దగ్గర పోలికలు ఉంటాయి. అంతేకాదు తెలివైన, విశ్వాసం గల జంతువు కూడా ఏనుగు. అయితే ఏనుగుకి తినేందుకు ఆహారం ఇస్తే.. తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుని చకచకా తినేస్తుంది. కానీ ఓ ఏనుగు మాత్రం నేను అందరికంటే భిన్నం ఇంకా చెప్పాలంటే మనిషికంటే ఏ మాత్రం తక్కువ కాను అనిపించేలా చేస్తోంది.. తనకు అరటి పండు తినడానికి ఇస్తే.. తన తొండంతో అరటి పండు తొక్క తీసి అప్పుడు తిన్నది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బెర్లిన్ జంతుప్రదర్శనశాలలో నివసించే పాంగ్ ఫా అనే ఆడ ఆసియా ఏనుగు. అత్యంత తెలివైంది. అంతేకాదు మనిషి అవగాహనకు మించిన మానసిక సామర్థ్యాలను కలిగి ఉంది. ఇటీవల… తనకు తినడం కోసం ఇచ్చిన అరటి పండు ను తొక్క తీసుకుని అప్పడు తిన్నది. స్వీయ శిక్షణ కలిగిన ఏనుగు వీడియో వీక్షకులకు నచ్చింది. ఈ పాంగ్ ఫా చాలా ప్రత్యేకమైన ఆసియా ఏనుగని తెలుస్తోంది. భారీ తొండంతో పలుచటి అరటిపండు తొక్కని అత్యంత నేర్పుగా తొలగించడమే కాదు.. అరటి పండు ఏ విధంగా నలగకుండా చాకచక్యంగా తొక్కని తొలగించింది.
వీడియోపై ఓ లుక్ వేయండి:




అయితే ఈ పాంగ్ ఫా పసుపు అరటిపండ్లను మాత్రమే తీసుకుంటుందని.. గోధుమ రంగులో ఉన్న అరటిపండ్లను దూరంగా ఉంచుతుందని ర్కొంది. బ్రౌన్ అరటిపండ్లను పాంగ్ ఫా తినడానికి ఇష్టపడదు .. తనకు ఇచ్చిన అరటి పండ్లను పరిశీలించి తనకు నచ్చిన పసుపు రంగు అరటి పండ్లు ఉంటేనే తింటుంది. లేదంటే వాటిని తినడానికి కాదు కదా.. కనీసం చూడడానికి కూడా ఇష్టపడదని తెలుస్తోందని బెర్న్‌స్టెయిన్ సెంటర్ ఫర్ కంప్యూటేషనల్ న్యూరోసైన్స్‌కు చెందిన మైఖేల్ బ్రెచ్ట్ అన్నారు. అంతేకాదు . “పాంగ్ ఫా అరటిపండు తొక్క తీసే ప్రక్రియ చాలా ప్రత్యేకమైనది .. దీని నైపుణ్యం, వేగం, వ్యక్తిత్వం అన్నీ మానవ జీవితాన్ని ప్రతిభింభిస్తాయని పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.