ఏం ఐడియా బాస్.. ఇది ఇండియా దాటకూడదంతే..
సోషల్ మీడియాలో చాలా ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా ఉంటే..మరికొన్ని వీడియోలు ఔరా అనేట్టుగా ఉంటాయి.
సోషల్ మీడియాలో చాలా ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా ఉంటే..మరికొన్ని వీడియోలు ఔరా అనేట్టుగా ఉంటాయి. ఇందులో దేశీ జుగాడ్‌లకు సంబంధించినవైతే మరింత ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటివి భారతీయులకే సాధ్యమనిపిస్తాయి. తాజాగా ఓ వ్యక్తి తెలివితేటలకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇసుమంతకూడా కష్టపడకుండా చేతిపంపునుంచి నీళ్లు నింపుతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా చేతితో పంపింగ్ చేస్తే బోరులోని నీరు పైకి వస్తుంది. ఒకే సమయంలో ఓ 10 బకెట్లు నీళ్లు కొట్టాలంటే చాలా కష్టం. దాంతో ఓ వ్యక్తి సూపర్ ఐడియా చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దేశీ చేతి పంపును ఆటోమేటిక్ హ్యాండ్ పంప్‌గా మార్చేశాడు. చేతిపంపు పక్కనే ఓ దిమ్మలాంటిది ఉంది. దానికి రెండు చక్రాలను అమర్చాడు. వాటికి సైకిల్ చైను అమర్చాడు. ఆ చక్రానికి సైకిల్ పెడల్‌ను హ్యాండిల్‌గా అమర్చాడు. దానికి ఓ వెదురు కర్రను అమర్చి దానిని పంప్ హ్యాండిల్‌కి కట్టాడు. వీటన్నిటికి కరెంట్ వైర్లతో కనెక్షన్ ఇచ్చి చక్రం ఆటోమేటిక్‌గా తిరిగేలా చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

