AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య.! ఏర్పాట్లు మొదలు పెట్టిన అధికారులు

అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన పూర్తయినప్పటి నుంచి రామనగరికి భక్తులు పోటెత్తున్నారు. ప్రతిరోజూ ఒకటిన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. గడచిన 18 రోజుల్లో దాదాపు 40 లక్షల మంది భక్తులు రామ్‌లల్లాను దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతోంది. రాబోయే శ్రీరామ నవమి సందర్భంగా కోటి మంది భక్తులు అయోధ్యకు రావచ్చనే అంచనాలున్నాయి.

Anil kumar poka
|

Updated on: Feb 11, 2024 | 12:59 PM

Share

అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన పూర్తయినప్పటి నుంచి రామనగరికి భక్తులు పోటెత్తున్నారు. ప్రతిరోజూ ఒకటిన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. గడచిన 18 రోజుల్లో దాదాపు 40 లక్షల మంది భక్తులు రామ్‌లల్లాను దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతోంది. రాబోయే శ్రీరామ నవమి సందర్భంగా కోటి మంది భక్తులు అయోధ్యకు రావచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో ఆలయ అధికారులు ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి ఉ‍త్సవాలు జరగనున్నాయి. చైత్ర మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదవ రోజున శ్రీరాముని జన్మదినోత్సవం జరగనుంది. ఈసారి ఏప్రిల్ 17న శ్రీరామ నవమి జరగనుంది. చైత్ర నవరాత్రుల ప్రారంభంతో ఉత్సవాలు మొదలు కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రామజన్మభూమి గేట్ నంబర్ మూడు నుంచి కూడా భక్తులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలోని 40 అడుగుల వెడల్పు రోడ్డు నిర్మాణం పూర్తయింది. గతంలో ఈ మార్గాన్ని వీఐపీల రాకపోకలకు ఉపయోగించేవారు. దీంతో పాటు ఆలయ సముదాయానికి ఉత్తర దిశలో కొత్త రోడ్డును కూడా నిర్మిస్తున్నారు. రామజన్మభూమి మార్గాన్ని రైల్వే స్టేషన్‌కు అనుసంధానించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం: Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్