Big News Big Debate: ముందస్తు Vs జమిలి.. ప్రత్యేక పార్లమెంట్ భేటి వ్యూహమేంటి? పొత్తులు INDIA కూటమికి కలిసొస్తాయా?
Big News Big Debate: దేశవ్యాప్తంగా రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న వేళ అనూహ్యంగా వన్ నేషన్ - వన్ ఎలక్షన్ నినాదం తెరమీదకు వచ్చింది. ఎప్పుడు ఏమైనా జరగొచ్చన్న ఉద్దేశంతో అటు విపక్ష కూటమి ఇండియా కూడా ఎన్నికలకు సిద్ధమంటూ సవాల్ చేస్తోంది. ఉమ్మడి కార్యాచరణతో ఉద్యమాలు చేయడంతో పాటు... సీట్ల సర్దుబాటు చేసుకోవాలని కూటమి నిర్ణయించింది.
Big News Big Debate: దేశవ్యాప్తంగా రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న వేళ అనూహ్యంగా వన్ నేషన్ – వన్ ఎలక్షన్ నినాదం తెరమీదకు వచ్చింది. ఎప్పుడు ఏమైనా జరగొచ్చన్న ఉద్దేశంతో అటు విపక్ష కూటమి ఇండియా కూడా ఎన్నికలకు సిద్ధమంటూ సవాల్ చేస్తోంది. ఉమ్మడి కార్యాచరణతో ఉద్యమాలు చేయడంతో పాటు… సీట్ల సర్దుబాటు చేసుకోవాలని కూటమి నిర్ణయించింది.
ఓవైపు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ఏర్పాట్లు… మరోవైపు INDIA కూటమి ఎన్నికల వ్యూహరచన…
దేశ రాజకీయాల్లోనూ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 18 నుంచి ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు పెడతారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. ఇదంతా నిజమా? అబద్దమా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండగానే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పాటు చేసింది. దీంతో అంతటా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యమైన విషయాలు అంశాలు ఉన్నాయనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశామన్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. BYTE>>>
అటు జమిలి ఎన్నికలు వార్తలపై ఆయా పార్టీల నుంచి భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ జమిలి జపం చేస్తుందన్నారు తెలంగాణ మంత్రి తలసాని. అటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు సీపీఐ నేతలు. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చడానికివీల్లేదంటున్నారు సీపీఐ నేత
అటు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటున్న విపక్ష కూటమి.. సిద్ధమవుతోంది. ముంబైలో జరిగిన ఇండియా కూటమి కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కమిటీలు వేసిన ఇండియా కూటమి.. సాధ్యమైనంత త్వరగా సీట్లు సర్దుబాటు చేసుకోవాలని తీర్మానం చేసింది. ఇండియా కూటమి అంటే 60శాతం ప్రజలు అంటున్న రాహుల్ గాంధీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
మొత్తానికి దేశ రాజకీయాల్లో రాబోయే పార్లమెంట్ సమావేశాలు కీలకమలుపు కాబోతున్నాయా? ముందస్తు వచ్చినా సంచలనమే? వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టినా అంతకుమించిన ప్రకంపనలే పుట్టిస్తాయనడంలో సందేహం లేదు. మరి ఏది నిజం కాబోతుంది?
బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..