Rahul GandhI: ఈ బలమైన శక్తిని ఓడించడం బీజేపీ తరం కాదు: రాహుల్ గాంధీ

ఇండియా ఒక్కటైతే గెలవడం బీజేపీకి అసాధ్యమని ఇండియా కూటమి ప్రకటించింది. కలిసికట్టుగా పోటీ చేయాలని, దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ఉధృతం చేయాలని తీర్మానాలతో పాటు పార్టీల మధ్య సమన్వయానికి కమిటీ ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు తమ ముందున్న బాధ్యత వీలైనంత మేరకు అత్యంత సమర్థవంతంగా కలిసికట్టుగా ఉండటమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దాదాపు 60 శాతం భారతదేశ జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు ఒకే వేదికపై ఉన్నాయన్నారు.

Rahul GandhI: ఈ బలమైన శక్తిని ఓడించడం బీజేపీ తరం కాదు: రాహుల్ గాంధీ

|

Updated on: Sep 01, 2023 | 7:12 PM

ముంబయి వేదికగా రెండు రోజులు సాగిన ఇండియా కూటమి సమావేశం మూడు తీర్మానాలతో ముగిసింది. 27 పార్టీలకు చెందిన 60 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కలిసి పోటీ చేసేందుకు వీలైనంత త్వరగా సీట్ల పంపిణీ పూర్తి చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వీలైనన్ని చోట్ల కలిసికట్టుగా పోటీ చేయడం, ప్రజాప్రాధాన్య అంశాలపై దేశంలో వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించడం, జుడేగా భారత్‌, జీతేగా పేరుతో దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రచారం నిర్వహించాలనే తీర్మానాలను ఇండియా కూటమి ఆమోదించింది. వివిధ పార్టీల మధ్య సమన్వయం కోసం 14 మందితో కోఆర్డినేషన్‌ కమిటీ, ఆ కమిటీ కింద పనిచేసే మూడు కమిటీల ఏర్పాటుపై ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది.

మరో వైపు వంద రూపాయలు పెంచి రెండు రూపాయలు తగ్గించడం ప్రధాని మోదీకి చెల్లిందని ఇండియా కూటమి ముగింపు సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. గ్యాస్‌ ధర రెండొందలు తగ్గించినా ధర ఏ మాత్రం తగ్గలేదని విమర్శించారు. ఈ భేటీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఇండియా కూటమి పార్టీలన్నీ ఒక్కటైతే బీజేపీ గెలుపు అసాధ్యమని ప్రకటించారు. మరో వైపు ముంబయి సదస్సులో ఇండియా కూటమి లోగో ఆవిష్కరించాలన్న నిర్ణయాన్ని పార్టీలు వాయిదా వేసుకున్నాయి. లోగో డిజైన్‌, రంగులపై కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇండియా కూటమి మరో విడత సమావేశం ఉంటుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. కాని, ఎప్పుడు, ఎక్కడా అని వివరాలు మాత్రం వెల్లడించలేదు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

 

 

Follow us