AP News: చంద్రబాబుకు ఐటీ నోటీసులపై పేర్ని నాని కీలక కామెంట్స్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆదాయ పన్ను శాఖ నుంచి చంద్రబాబుకు నోటీసు వచ్చిన మాట వాస్తవమా? కాదా? చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. కథనం ప్రచురించిన ఇంగ్లీష్ పత్రికపై పరువు నష్టం దావా వేస్తారా అని మంత్రి అమర్నాథ్ లోకేశ్‌ను ప్రశ్నించారు. ఈ ఐటీ నోటీసులపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇక టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాలి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఐటీ నోటీసులు అందాయంటూ ఓ ఇంగ్లిష్ పత్రికలో కథనం వచ్చిందని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లోనే ఐటీ నోటీసు ఇచ్చారని, అయినా దాని గురించి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. పీఎస్ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయని ఆ కథనంలో ఉందన్నారు పేర్ని నాని. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా చంద్రబాబుకు ఐటీ నోటీసులందాయని చెప్పారు. ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి….. చంద్రబాబును సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.