Hyderabad: ట్రాన్స్‌జెండర్లతో ముజ్రా పార్టీ.. నిర్వాహకుడికి తమదైన స్టైల్‌లో బుద్ధి చెప్పిన పోలీసులు..
Hyderabad: అక్బర్ అనే రౌడీ షీటర్ గాంగ్ గ్యాదరింగ్ పార్టీలో ట్రాన్స్‌జెండర్‌లతో ముజ్రా డాన్స్ చేయించగా దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన హబీబ్ నగర్ పోలీసులు.. సదరు రౌడీ షీటర్‌తో పాటు అతనితో ఉన్నవారికి తమదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఇంకా కేసు నమోదు చేసి, మరో సారి ఇలాంటి వేషాలు వేయబోమని చెప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 22: హైదరాబాద్‌లోని హబీబ్ నగర్‌కి చెందిన అక్బర్ అనే రౌడీ షీటర్ గాంగ్ గ్యాదరింగ్ పార్టీలో ట్రాన్స్‌జెండర్‌లతో ముజ్రా డాన్స్ చేయించగా దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన హబీబ్ నగర్ పోలీసులు.. సదరు రౌడీ షీటర్‌తో పాటు అతనితో ఉన్నవారికి తమదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఇంకా కేసు నమోదు చేసి, మరో సారి ఇలాంటి వేషాలు వేయబోమని చెప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
