ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర.. మండుటెండలో స్థానికుల సమస్యలను.!

మండుటెండలో సీఎం జగన్‌ బస్సుయాత్ర కొనసాగుతోంది. 16వ రోజు ఏలూరు జిల్లా నారాయణపురం నుంచి ప్రారంభమైన జగన్‌ యాత్ర... నిడమర్రు దాటింది. ప్రస్తుతం గణపవరంలో యాత్ర సాగుతోంది. కాసేపట్లో ఉండి చేరుకుని అక్కడ లంచ్‌ బ్రేక్‌ తీసుకుంటారు. ఇక, అక్కడ్నుంచి భీమవరం చేరుకొని..

ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర.. మండుటెండలో స్థానికుల సమస్యలను.!
Cm Jagan
Follow us

|

Updated on: Apr 21, 2024 | 1:47 PM

మండుటెండలో సీఎం జగన్‌ బస్సుయాత్ర కొనసాగుతోంది. 16వ రోజు ఏలూరు జిల్లా నారాయణపురం నుంచి ప్రారంభమైన జగన్‌ యాత్ర… నిడమర్రు దాటింది. ప్రస్తుతం గణపవరంలో యాత్ర సాగుతోంది. కాసేపట్లో ఉండి చేరుకుని అక్కడ లంచ్‌ బ్రేక్‌ తీసుకుంటారు. ఇక, అక్కడ్నుంచి భీమవరం చేరుకొని బహిరంగసభలో ప్రసంగిస్తారు. సభ తర్వాత పిప్పర, పెరవలి, సిద్ధాంతం మీదుగా ఈతకోట వరకు సాగుతుంది యాత్ర. నిడమర్రు దగ్గర స్థానికుల సమస్యలను విన్నారు సీఎం జగన్‌. మండుటెండలో సైతం బస్సు దిగొచ్చి ప్రజలతో మాట్లాడారు. జగన్‌తో చేయి కలిపేందుకు, ఆయనతో మాట్లాడేందుకు పోటీపడ్డారు స్థానికులు. గణపవరంలో ఓ పిల్లాడికి అక్షరాభ్యాసం చేయించారు సీఎం జగన్‌. పిల్లాడి చేయి పట్టుకొని పలకపై ఇంగ్లీష్‌ అక్షరాలు ఏబీసీడీలు రాయించారు. ఆ తర్వాత ఆ చిన్నారిని ఆశీర్వదించారు జగన్‌.