AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన యువకుడు.. చివరకు ఏం జరిగిందంటే..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిన ఘటన విని ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే డిపో నుండి రెండు కిలో మీటర్ల దూరంలో సోఫీ నగర్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. దాంతో అక్కడే నిలిచిపోయింది. అది గమనించిన ఆర్టీ సెక్యూరిటీ సిబ్బంది వెంబడించారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, ఇక్కడ ఏం జరిగిందంటే..

మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన యువకుడు.. చివరకు ఏం జరిగిందంటే..
Rtc Bus Stolen
Jyothi Gadda
|

Updated on: Sep 24, 2024 | 12:42 PM

Share

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్‌ డిపోలో చోరీ కలకలం రేపింది. సెప్టెంబర్ 22న అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్సు చోరీకి గురికావడం అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. దీంతో అధికారులు, సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిన ఘటన విని ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే డిపో నుండి రెండు కిలో మీటర్ల దూరంలో సోఫీ నగర్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. దాంతో అక్కడే నిలిచిపోయింది. అది గమనించిన ఆర్టీ సెక్యూరిటీ సిబ్బంది వెంబడించారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, ఇక్కడ ఏం జరిగిందంటే..

ఈ వీడియో చూడండి..

మహారాష్ట్రకు చెందిన గణేష్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో ఆర్టీసీ డిపో గోడదూకి లోపలిని ప్రవేశించాడు. తాగిన మైకంలో ఆర్టీసీ బస్సును తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సోఫీ నగర్ వైపు వెళ్ళగా కంచరోని చెరువు సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది. గమనించిన స్థానికులు వెంటనే ఆర్టీసీ కార్యాలయానికి సమాచారం అందించారు.. ఆర్టీ సెక్యూరిటీ సిబ్బంది వెంబడించి కడ్తాల్ గ్రామ సమీపంలో బైపాస్ దగ్గర అతడిని పట్టుకున్నారు. కాగా, పోలీసుల విచారణలో బస్సు ఆగి ఉంటే తీసుకొచ్చానని నిందితుడు చెప్పినట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!