AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taj Mahal: ప్రేమ చిహ్నానికి పగుళ్లు.. మసకబారుతున్న గత వైభవం..! అందరిలో ఆందోళన..

గోడలలో పొదిగిన విలువైన రాళ్లు కూడా అవసాన దశకు చేరుకుంటున్నాయని షకీల్‌ చౌహాన్‌ తెలిపారు. ప్రధాన సమాధి భాగాలు, గోడలు బీటలు వారాయి. గోపురం మార్బుల్‌లో కూడా పగుళ్లు ఉన్నాయని టూరిస్ట్ గైడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దీపక్ ధన్ తెలిపారు.

Taj Mahal: ప్రేమ చిహ్నానికి పగుళ్లు.. మసకబారుతున్న గత వైభవం..! అందరిలో ఆందోళన..
Taj Mahal
Jyothi Gadda
|

Updated on: Sep 23, 2024 | 1:43 PM

Share

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మల్‌..ఇప్పుడు ప్రమాదం అంచుకు చేరుకుంటుందా..? అంటే అవుననే అంటున్నారు పర్యాటకులు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్‌మహల్‌లోని నేల, గోడలతో సహా ఇతర ప్రాంతాల్లో పగుళ్లు వచ్చాయనే వార్తలు ప్రపంచ పర్యాటకుల్ని ఆందోళనకు గురి చేసింది. గత వారం ఆగ్రాలో కురిసిన వర్షానికి తాజ్‌మహల్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. మరోవైపు, మొఘలుల కాలంలో నిర్మించిన కట్టడాల్లోని రాళ్ల కీళ్లను పటిష్టం చేసేందుకు ఉపయోగించే ఇనుప గొలుసులు, రాడ్లు ఇప్పుడు సమస్యగా మారుతున్నాయి. అవి తేమ, ఆక్సిజన్‌తో తాకినప్పుడు అవి తుప్పు పట్టడం, ఉబ్బడంతో రాళ్ళు పగుళ్లు ఏర్పడుతున్నాయి. తాజ్ మహల్, ఆగ్రా కోట, ఇతర స్మారక చిహ్నాలలో ఇప్పుడు ఇదే పరిస్థితి ఏర్పడింది.

తాజ్‌మహల్‌ గోపురం చుట్టూ ఉన్న తలుపులపై అరబిక్‌లో రాసి ఉన్న ఖురాన్‌లోని కొన్ని శ్లోకాలు కూడా చెరిగిపోయినట్టుగా టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి షకీల్ తెలిపారు. గోడలలో పొదిగిన విలువైన రాళ్లు కూడా అవసాన దశకు చేరుకుంటున్నాయని షకీల్‌ చౌహాన్‌ తెలిపారు. ప్రధాన సమాధి భాగాలు, గోడలు బీటలు వారాయి. గోపురం మార్బుల్‌లో కూడా పగుళ్లు ఉన్నాయని టూరిస్ట్ గైడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దీపక్ ధన్ తెలిపారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం తాజ్‌మహల్‌ కట్టడానికి సంబంధించి ఎలాంటి తీవ్ర సమస్యలు లేవని తాజ్‌మహల్‌ నిర్వహణను చూస్తున్న భారత పురావస్తు సంస్థ (ఏఎస్‌ఐ) స్పష్టం చేసింది. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షానికి తాజ్‌మహల్‌ ప్రధాన గుమ్మటం నుంచి నీరు కారడమే కాక, కట్టడం ముందున్న తోట నీట మునిగిందనే వార్తలు కూడా అన్ని మీడియాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..