ఖరీదైన చికిత్స అవసరం లేదు.. ఈ ఒక్కటి నూనెలో కలిపి తలకు రాసుకుంటే చాలు… పట్టులాంటి ఒత్తైన జుట్టు మీ సొంతం.!

జుట్టు సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడానికి సమయం తీసుకోకపోతే అది మీకు ఇబ్బందిగా మారుతుంది. హెయిర్‌ కేర్‌ పాటించకపోతే.. మీ జుట్టు చాలా త్వరగా పాడైపోతుంది. అయితే, జుట్టు పెరుగుదల, ఒత్తైన నల్లని జుట్టుకోసం కొన్ని వంటింటి చిట్కాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. అందులో ఒకటి మందార నూనె.. ఇది జుట్టు సంబంధిత సమస్యలను త్వరగా నయం చేస్తుంది. దీంతో మీ జుట్టు పట్టులాంటి నిగారింపును సొంతం చేసుకుంటుంది..అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Sep 23, 2024 | 7:21 AM

కొన్ని నూనెలు జుట్టు మెరుపు, చక్కటి పెరుగుదలకు సహాయపడతాయి. ఇందుకోసం రసాయన ఆధారిత నూనెలను ఉపయోగించకుండా మీ జుట్టుకు తేలికపాటి, మరింత ప్రభావవంతమైన మూలికా నూనెలను అప్లై చేయడం మంచిది. ఇవి మీ జుట్టు మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించవు. అంతే కాదు, ఇది మీ జుట్టు ఆరోగ్యాన్ని మరింతగా సంరక్షిస్తాయి.

1 / 7
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మందార నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీ ఇంట్లో పెరిగే అందమైన మందార పువ్వు మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఎర్ర మందార పువ్వులను అనేక నూనెలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి, మందార ఆకులు, పువ్వులతో చేసిన నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

2 / 7
మందార నూనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. విటమిన్ ఎ సి, అమైనో ఆమ్లం, మీ జుట్టును పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. మందార నూనె జుట్టు మెరుపును పెంచడమే కాకుండా జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది. ఇది మీ తలపై చుండ్రును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

3 / 7
మందార నూనె జుట్టు పెరుగుదలలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్ సి జుట్టు మూలాలను బలపరుస్తాయి. మందార నూనెను జుట్టుకు పట్టించి బాగా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ సరిగా జరిగి, జుట్టు బలంగా పెరుగుతుంది.

4 / 7
కొందరికి వచ్చే మరో సాధారణ సమస్య ఏంటంటే, పొడవాటి జుట్టు ఉన్నా కూడా ఒత్తుగా ఉండదు. అంటే జుట్టు సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. దీంతో జుట్టు చాలా బలహీనంగా మారుతుంది. మందార నూనెను ఉపయోగించి బలహీనమైన జుట్టును కూడా బలోపేతం చేయవచ్చు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్ కంటెంట్ ఉంటాయి. రూట్ నుండి జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు చిట్లడం సమస్యను పరిష్కరిస్తుంది.

5 / 7
మందార జుట్టు నూనెను మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు. లేదా ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా నాలుగు లేదా ఐదు మందార పువ్వులు, మందార ఆకులు, 10 కరివేపాకు, 120 మి.లీ కొబ్బరి నూనె తీసుకోండి. మందార ఆకులు, కరివేపాకులను పేస్ట్ లా చేయండి.

6 / 7
తర్వాత ఒక పాత్రలో కొబ్బరి నూనె వేసి వేడి చేసి ఈ పేస్ట్‌ను నూనెలో వేసి నాలుగైదు నిమిషాలు మరిగించాలి. నూనె చల్లారిన తర్వాత వడకట్టి ఆ నూనెను తలకు పట్టించాలి. ఈ నూనెను రోజూ తలకు పట్టించి మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరగడమే కాకుండా మెరుపు కూడా వస్తుంది.

7 / 7
Follow us