Vastu Tips: ఇంట్లో తులసి మొక్క ఉంటే.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి..!

హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరు ఇంట్లో తులసి మొక్క ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే వాస్తురీత్యా ఐశ్వర్యాన్నిచ్చే తులసి మొక్క గౌరవప్రధామైనది. అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. తులసి దగ్గర ఉంచకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని పొరపాటున కూడా తులసి మొక్కకు దగ్గరగా పెట్టరాదు. ఇలా చేస్తే..లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. తులసి మొక్క దగ్గర పెట్టకూడని వస్తువులు ఏంటో తెలుసుకుందాం.

|

Updated on: Sep 23, 2024 | 8:01 AM

తులసి మొక్కను అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కాబట్టి తులసిని మీ ఇంటి ఆవరణంలో దక్షిణ దిశలో పొరపాటున కూడా నాటకూడదు. ఎందుకంటే ఈ దిక్కును పూర్వీకుల దిక్కుగా భావిస్తారు. దక్షిణ దిక్కులో తులసిని నాటితే మీకు భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. మీ కుటుంబ జీవితంలో కూడా కలహాలు పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం, సరైన దిశలో ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు, సానుకూలత నిపుణులు చెబుతున్నారు. తులసిని ఇంట్లోని ఏ దిక్కులో పడితే అక్కడ ఉంచకూడదు.. అలా చేయడం వల్ల మీరు ఏరి కోరి కష్టాలకు ఆహ్వానం పలికినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్కను ఏ దిక్కులో ఉంచాలి.. తులసిని ఎప్పుడు పూజించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

2 / 5
మన ఇంట్లో దేవుని పూజ కోసం వాడే తులసిని మనం నిత్యం పూజ చేసే తులసి కోటలో తులసి మొక్క నుంచి సేకరించకూడదని చెబుతున్నారు. అలా చేస్తే దరిద్రం పట్టి పీడిస్తుంది. పూజ కోసం ప్రత్యేకంగా వేరొక ప్రదేశంలో కానీ, కుండీలో కానీ తులసిని పెంచి ఆ మొక్క నుంచి మాత్రమే పూజ కోసం తులసి దళాలు సేకరించాలని చెబుతున్నారు.

3 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్కను తూర్పు దిశలోఉంచాలని చెబుతున్నారు. దీని వల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయని నమ్ముతారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులలో కూడా పెంచుకోవచ్చునని చెబుతున్నారు. ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.

4 / 5
తులసిని నిత్యం పూజించి, సాయంత్రం నెయ్యి దీపం వెలిగిస్తే, లక్ష్మీదేవి ప్రసన్నుడై ఫలితాలను ఇస్తుందని నమ్మకం. అలాగే, తులసి మొక్క పైన ఉండే విత్తనాలు క్రమం తప్పకుండా తీసి జాగ్రత్త చేస్తూ ఉండాలి. అప్పుడే తులసి మొక్క చక్కగా నిటారుగా పెరుగుతుంది. అయితే మంగళ శుక్రవారాల్లో తులసి దళాలు కోయకూడదు. మిగిలిన రోజుల్లో తులసి దళాలను కోసి పూజలో సమర్పించాలని చెబుతున్నారు.

5 / 5
Follow us