World’s Richest Dog: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. ఆస్తి విలువ తెలిస్తే బిత్తరపోవడం ఖాయం..!
Viral News : ఒక్కోసారి మనం బాగా విసుగు చెందినప్పుడు కుక్కకన్నా హీనంగా జీవిస్తున్నామని పోల్చుకుంటాం.

Viral News : ఒక్కోసారి మనం బాగా విసుగు చెందినప్పుడు కుక్కకన్నా హీనంగా జీవిస్తున్నామని పోల్చుకుంటాం. కానీ ఇప్పడు ఈ కుక్కని చూస్తే బతికితే ఈ కుక్కలాగ బతకాలి అంటారు. మరి అంతలా ఆ కుక్కకు ఉన్న స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
యూఎస్‌లోని మియామిలో నివసిసున్న గుంథర్-VI అనే కుక్క అత్యంత సంపన్నమైన కుక్కగా రికార్డులకెక్కింది. ఈ కుక్కకి 500 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 3,715 కోట్ల రూపాయల సంపద గుంథర్ తాతగారైన గుంథర్IV అనే మరో కుక్కనుంచి వారసత్వంగా లభించింది. కొన్ని దశాబ్దాలుగా ఈ కుక్కలకు ఇలా వారసత్వంగా ఆస్తులు లభిస్తున్నాయి. ఈ కుక్క వంశానికి చెందిన గుంథర్ III 1992లో మరణించింది. దాంతో ఈ కుక్కకు రూ. 431 కోట్ల విలువ చేసే ట్రస్ట్ వారసత్వంగా లభించింది. ఇలా లభించిన ఆస్తికి రోజు రోజుకూ విలువ పెరగడంతో గుంథర్ VI కుక్క ప్రపంచంలో అత్యంత ఆస్తి కలిగిన కుక్కగా నిలిచింది. ఈ కుక్కల ఆఖరి యజమాని చనిపోయిన తర్వాత హ్యాండర్ల బృందం వీటి బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే ఇప్పడు ఈ కుక్కకు చెందిన టుస్కాన్ విల్లాను అమ్మకానికి పెట్టారు.
తొమ్మిది బెడ్‌రూమ్‌లు, ఎనిమిది బాత్‌రూమ్‌లు, ఔట్ డోర్ స్విమ్మింగ్ పూల్ ఉండే ఈ ఇంటిని విక్రయించే బాధ్యత.. ది అసోలిన్ టీమ్‌కు చెందిన ‘రూతీ అండ్ ఏతాన్ అస్సౌలిన్’ అనే సంస్థ తీసుకుంది. ఈ మేరకు ఆ సంస్థ నిర్వాహకురాలు మాట్లాడతుతూ.. అత్యంత ఖరీదైన ఈ భారీ సౌధానికి యజమాని కుక్క అని తెలుసుకుని నమ్మలేకపోయానని తెలిపారు. ఈ భవనానికి గొప్ప చరిత్ర ఉందని, గుంథర్ VIతో తాము సమావేశమైనప్పుడు ఆ కుక్క పరుగెత్తుకుంటూ వచ్చి తనకు ముద్దిచ్చిందని, అప్పుడు తమతో ఒప్పందం చేసుకోవడం తనకు ఇష్టమే అన్నట్లుగా ఇలా ముద్దిచ్చినట్లుందని భావిస్తున్నానని తెలిపారు.
Also read:
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్… ఈసారి మెగా.. అక్కినేని ఫ్యామిలీ హీరోలతో సినిమా ?..
Ram Charan: చరణ్.. శంకర్ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అందుకోసం భారీ సెట్..
Andhra Pradesh Politics: ఏపీ అసెంబ్లీ పరిణామాలపై నారా ఫ్యామిలీ ఫైర్.. సంచలన కామెంట్స్ చేసిన రోహిత్..
