టాలీవుడ్‏లో మరో భారీ మల్టీస్టారర్… ఈసారి మెగా.. అక్కినేని ఫ్యామిలీ హీరోలతో సినిమా ?..

ఇటీవల సినీ రంగంలో మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. స్టార్ హీరోస్ కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి

టాలీవుడ్‏లో మరో భారీ మల్టీస్టారర్... ఈసారి మెగా.. అక్కినేని ఫ్యామిలీ హీరోలతో సినిమా ?..
Sai
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Nov 20, 2021 | 7:06 PM

ఇటీవల సినీ రంగంలో మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. స్టార్ హీరోస్ కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే వరుణ్ తేజ్..వెంకటేష్, పవన్ కళ్యాణ్.. వెంకటేష్ కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టా్రర్ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‎లో మరో భారీ మల్టీస్టారర్ రాబోతుందని గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది. ఈసారి మెగా… అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఇద్దరు యంగ్ హీరోలు అందులో ప్రధాన పాత్రలు పోషించబోతున్నాట.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్‏ ఇప్పుడు వరుస స్పీడ్ మీదున్నాడు. భిన్నమైన స్టోరీలతో సినిమాలను చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. అయితే ఓవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మరోవైపు మల్టీస్టారర్ చేయాలని భావిస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో .. అక్కినేని అఖిల్ లేదా నాగచైతన్యతో కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఈసినిమాలో సాయి ధరమ్ తేజ్‏తో కలిసి అఖిల్ నటించనున్నాడా ? లేదా నాగచైతన్య నటించనున్నాడా అనే విషయంపై స్పష్టత రాలేదు. నిజానికి సాయి ధరణ్ తేజ్ గతంలో నందమూరి కళ్యాణ్ రామ్.. సాయి ధరమ్ తేజ్ కాంబో ఓ మల్టీస్టారర్ రాబోతుందని టాక్ వచ్చింది. కానీ ఆ విషయంపై వివరాలు రాలేదు. ఆ తర్వాత. 1982 సూపర్ హిట్ బిల్లా రంగా సిక్వెల్లో మంచు మనోజ్ , సాయి ధరమ్ తేజ్ కాంబోలో మల్టీస్టారర్ రాబోతుందని అన్నారు. కానీ ఎందుకో కుదరలేదు. ఇప్పుడు అక్కినేని హీరోలతో సాయి నటించనున్నాడని టాక్. మరీ చూడాలి ఈసారి ఈ మల్టీస్టారర్ పట్టాలెక్కనుందో లేదో.

Also Read: Ram Charan: చరణ్.. శంకర్ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అందుకోసం భారీ సెట్..

Laal Singh Chaddha: అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా నుంచి స్పెషల్ అప్డేట్.. నాగచైతన్య మూవీ రిలీజ్ ఎప్పుడంటే..


లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu