AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Kaur: ఈటల రాజేందర్‌తో భేటీ అయిన హీరోయిన్‌ పూనమ్ కౌర్.. జ్ఞాపిక అందజేత..

Poonam Kaur meets Etela Rajender: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గతకొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా

Poonam Kaur: ఈటల రాజేందర్‌తో భేటీ అయిన హీరోయిన్‌ పూనమ్ కౌర్.. జ్ఞాపిక అందజేత..
Poonam Kaur Meets Etela Raj
Shaik Madar Saheb
|

Updated on: Nov 20, 2021 | 6:54 PM

Share

Poonam Kaur meets Etela Rajender: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గతకొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈక్రమంలో తాజాగా పూనమ్‌ కౌర్‌ హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. ఈటలతో పాటు ఆమె సతీమణి జమునతో కూడా ఆమె ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పూనమ్‌ కౌర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపు సాధించిన ఈటలను ఘనంగా సత్కరించారు. కషాయం రంగు కండువా కప్పి సత్కరించి ఏక్ ఓంకార్ అనే మత పరమైన జ్ఞాపికను కూడా పూనమ్ అందజేశారు. సిక్కు మతగురువు గురునానక్‌ జయంతిని పురస్కరించుకొని ఆమె ఈటల ఇంటికి వెళ్లి అభినందించారు.

ఈ సందర్భంగా ఈటలతో కలిసి పూనమ్‌ కౌర్‌ శాంతి కపోతాలు పావురాలను గాల్లోకి ఎగురవేశారు. దీనిపై పూనమ్ కౌర్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్లో ట్విట్‌ చేశారు. స్వేచ్ఛా భావనలకు నిదర్శనంగా పావురాళ్లను ఎగురవేసినట్లు ఆమె తెలిపారు. ఆత్మగౌరవం, దయ, అంకితభావం ఉన్న వ్యక్తులను గురునానక్ ఎప్పుడూ దీవిస్తాడంటూ పూనమ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా.. నటి పూనమ్ కౌర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో భేటీ కావడంపై పలు ఊహగానాలు మొదలయ్యాయి.

ఇన్ని రోజులు ఏ పార్టీకి గాని.. నాయకులకు గానీ మద్దతు తెలపకుండా.. పలు అంశాలపై సోషల్ మీడియాలో స్పందించే పూనమ్ కౌర్.. ఈటలను కలవడం చర్చనీయాంశంగా మారింది.

Also Read:

Jr NTR: వ్యక్తిగత దూషణలు సరికాదు.. అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం..

Naga Babu: చంద్రబాబు కంటతడి పెట్టడంపై స్పందించిన మెగా బ్రదర్‌.. అసెంబ్లీ పరిణామాలపై సీరియస్ కామెంట్స్..

AP Floods: రెస్క్యూ చేస్తుండగా ప్రమాదం.. తండ్రీకొడుకులను కాపాడి చనిపోయిన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్..