Viral Video: దొంగకు ఊహించని షాకిచ్చిన మహిళ.. టెక్నాలజీతో దొంగకు ఎలా చెక్ పెట్టిందో చూడండి…

ఇటీవల సోషల్ మీడియా వాడకం విరివిగా పెరిగి పోయింది. అలాగే టెక్నాలజీ సైతం పూర్తిగా మారిపోయింది. మారుతున్న కాలానుగుణంగా..

Viral Video: దొంగకు ఊహించని షాకిచ్చిన మహిళ.. టెక్నాలజీతో దొంగకు ఎలా చెక్ పెట్టిందో చూడండి...
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 04, 2021 | 8:57 PM

ఇటీవల సోషల్ మీడియా వాడకం విరివిగా పెరిగి పోయింది. అలాగే టెక్నాలజీ సైతం పూర్తిగా మారిపోయింది. మారుతున్న కాలానుగుణంగా.. టెక్నాలజీ వాడకంలో దొంగలు కూడా ముందుంటున్నారు. ఇటీవల కార్లను దొంగిలించేందుకు టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తాజాగా ఓ దొంగ స్మార్ట్ టెక్నాలజీతో లగ్జరీ కారును దొంగిలించడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో.. ఓ మహిళ తన ఇంటి ముందు తన లగ్జరీ కారును పార్క్ చేసింది. అర్ధరాత్రి సమయంలో తన ఇంటి ముందు కుక్కలు ఎక్కువగా అరుస్తుండడంతో.. విషయం తెలుసుకోవడానికి బయటకు వచ్చి చూసింది. తన ఇంటి ముందు ఉన్న లగ్జరీ కారులో ఓ అజ్ఞాతవ్యక్తి ఉండడం గమనించింది. అంతేకాదు..అక్కడే ఉన్న స్ట్రీట్ లైట్స్ కారణంగా.. అతడి ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ దొంగ కారు డోర్ ఎలా తెరిచాడనేది ఆమెకు అర్థం కాలేదు. కానీ వెంటనే అప్రమత్తమై.. తన వద్ద ఉన్న రిమోట్‏తో కారును పూర్తిగా లాక్ చేసేసింది. దీంతో ఆ దొంగ కార్లో ఇరుక్కుపోయాడు. కార్ డోర్ ఓపెన్ చేయాడనికి అన్ని రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈలోగా.. ఆ మహిళ పోలీసులకు సమాచారమిచ్చింది. పోలీసులు వచ్చేవరకు ఆ దొంగ కారులోనే ఇరుక్కున్నాడని ఆ మహిళ చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

వీడియో..

Also Read: Acharya Movie: ఆచార్య పై ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ పడనుందా ? చిరు సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా ?

Mumbai Drugs: మత్తు మాటున దాగిన మర్మాలెన్నో.. డ్రగ్స్‌ కేసులో వెలుగులోకి వస్తున్న సంచలనాలు.. ఎన్సీబీ కస్టడీకి ఆర్యన్‌!

God Father: గాడ్ ఫాదర్‏లో మై విలేజ్ షో గంగవ్వ.. చిరంజీవి సినిమాలో తన పాత్ర ఏంటో చెప్పేసిందిగా..

ప్రభాస్ సినిమాలో ఖిలాడీ బ్యూటీ.. లక్కీ ఛాన్స్ అందుకున్న మీనాక్షి చౌదరీ.. ఏ మూవీలో అంటే..