AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ సినిమాలో ఖిలాడీ బ్యూటీ.. లక్కీ ఛాన్స్ అందుకున్న మీనాక్షి చౌదరీ.. ఏ మూవీలో అంటే..

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. ఒకవైపు ఆదిపురుష్ , సలార్ సినిమాల్లో

ప్రభాస్ సినిమాలో ఖిలాడీ బ్యూటీ.. లక్కీ ఛాన్స్ అందుకున్న మీనాక్షి చౌదరీ.. ఏ మూవీలో అంటే..
Meenakshi Chaudhary
Rajitha Chanti
|

Updated on: Oct 04, 2021 | 7:34 PM

Share

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. ఒకవైపు ఆదిపురుష్ , సలార్ సినిమాల్లో నటిస్తునే.. మరోవైపు… నయా ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఇక ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తిచేసిన ప్రభాస్.. ప్రస్తుతం ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చేస్తున్నాడు. అలాగే.. కేజీఎఫ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇందులో డార్లింగ్ సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని హాలీవుడ్ టెక్నాలజీ ఉపయోగించి రూపొందిస్తున్నారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా.. ఇందులో హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈమూవీలో మరో హీరోయిన్ ఉండనుందట. మాస్ మాహారాజ్ రవితేజ నటిస్తున్న ఖిలాడీ సినిమాలో హీరోయిన్‏గా నటిస్తున్న మీనాక్షి చౌదరీ.. సలార్ మూవీలో రెండవ హీరోయిన్‏గా నటిస్తోందట. ఇక ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ .. అక్కినేని సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలో కనిపించింది. ప్రస్తుతం మాస్ మాహారాజా సరసన ఖిలాడి మూవీలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. హిట్ 2 సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. అయితే ఇప్పటివరకు మీనాక్షికి సరైన హిట్టు పడలేదు. కానీ తెలుగులో మాత్రం ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమాతో మీనాక్షికి సూపర్ హిట్ పడడం ఖాయంగానే కనిపిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.

Also Read: Pushpa: ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన పుష్ప మేకర్స్.. పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య అంతిమ పోరు..

Aryan Khan: ఆర్యాన్ ఖాన్‏కు బెయిల్ నిరాకరణ.. మూడ్రోజుల కస్టడికి అనుమతించిన కోర్టు..

God Father: గాడ్ ఫాదర్‏లో మై విలేజ్ షో గంగవ్వ.. చిరంజీవి సినిమాలో తన పాత్ర ఏంటో చెప్పేసిందిగా..

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!