Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన పుష్ప మేకర్స్.. పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య అంతిమ పోరు..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మంగ్లింగ్ నేపథ్యంలో రూపొందిస్తున్న

Pushpa: ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన పుష్ప మేకర్స్.. పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య అంతిమ పోరు..
Pushpa
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 04, 2021 | 7:04 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మంగ్లింగ్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సమస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తోంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. రష్మిక గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. భారీ బడ్జెట్‏తో ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి వరుస కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇందులో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడని గతంలోనే ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఫహద్ మొదటి పార్ట్‏లో ఉండడు అని.. సినిమా చివరి సమయంలో కనిపిస్తాడని… ఇక మొదటి పార్ట్ మొత్తం సునిల్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. పుష్ప మొదటి భాగంలో విలన్‏గా ఫహద్ కనిపించనున్నాడని మరోసారి స్పష్టం చేసింది టీం. అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ మధ్య అదిరిపోయే సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతుందని.. పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య అంతిమ పోరును వెండితెరపై డిసెంబర్ 17న చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది.

ట్వీట్..

Also Read: Aryan Khan: ఆర్యాన్ ఖాన్‏కు బెయిల్ నిరాకరణ.. మూడ్రోజుల కస్టడికి అనుమతించిన కోర్టు..

God Father: గాడ్ ఫాదర్‏లో మై విలేజ్ షో గంగవ్వ.. చిరంజీవి సినిమాలో తన పాత్ర ఏంటో చెప్పేసిందిగా..

Janhvi Kapoor: వయ్యారంగా ఫోటోలకు ఫోజులిస్తున్న శ్రీదేవి తనయ.. జాన్వీని ఇలా చూస్తే మతి పోవాల్సిందే..