Aryan Khan: ఆర్యాన్ ఖాన్‌కు బెయిల్ నిరాకరణ.. మూడ్రోజుల కస్టడికి అనుమతించిన కోర్టు..
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యాన్ ఖాన్‌కు బెయిల్ నిరాకరించింది ముంబాయి కోర్టు. అంతేకాకుండా
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యాన్ ఖాన్‌కు బెయిల్ నిరాకరించింది ముంబాయి కోర్టు. అంతేకాకుండా.. ఆర్యాన్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఎస్సీబీకి మరో మూడ్రోజుల కస్టడీకి అనుమతించింది. నిన్న ముంబై క్రూయిజ్ రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడి చేసి.. ఆర్యాన్ ఖాన్‌తో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వారిని కోర్టులో ప్రవేశ పెట్టారు అధికారులు. ఆర్యాన్ ఖాన్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అతడితోపాటు.. అతని స్నేహితులను అక్టోబర్ 11 వరకు కస్టడీకి అనుమతించాలని ఎన్సీబీ తరపు న్యాయవాది కోర్టును కోరారు.. తమకు అందిన సమాచారం ఆధారంగానే రేవ్ పార్టీపై దాడి చేశామని.. అనుమానాస్పద లావాదేవీలపై పట్టుబడిన మరో ఐదుగురు వ్యక్తులు దర్యాప్తులో ఉన్నారని.. అలాగే తాజాగా మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని..ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ అవసరమని ఎన్సీబీ తరపు న్యాయవాది కోరారు..
ముంబై ఖిలా కోర్టులో డ్రగ్స్ కేసుపై వాడివేడిగా వాదనలు జరిగాయి. ఆర్యాన్‌ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడని.. క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వాహకులతో అతడికి ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఎన్సీబీ తరపు న్యాయవాది వాదించారు. అక్టోబర్ 11 వరకు ఆర్యన్‌తో పాటు అతను ఫ్రెండ్స్‌ను కస్టడీకి ఇవ్వాలని ఎన్సీబీ కోరింది. 9 రోజుల కస్టడీకి ఎన్సీబీ కోరగా మూడు రోజుల కస్టడీకి మాత్రమే న్యాయస్థానం అంగీకరించింది. ముంబై క్రూయిజ్‌లో ఆర్యన్ పట్టబడ్డ సమయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికినట్టు కోర్టుకు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. ఆర్యన్ ఫోన్లో , వాట్సాప్ చాట్స్‌లో డ్రగ్స్‌కు సంబంధించి కీలక సమాచారం లభించిందని, ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు కూడా బయటపడినట్టు వెల్లడించింది.
Also Read: God Father: గాడ్ ఫాదర్లో మై విలేజ్ షో గంగవ్వ.. చిరంజీవి సినిమాలో తన పాత్ర ఏంటో చెప్పేసిందిగా..
Drugs Case: కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్న ఆర్యన్ ఖాన్.. ఎన్‌సీబీ అధికారులు ఏం చేశారంటే..?
Pelli Sandadi: న్యూస్ యాంకర్‌గా మారిన శ్రీకాంత్ తనయుడు.. ఈ మార్పు వెనక కారణమేంటంటే..