స్కానింగ్ కోసం గదిలోకి వెళ్లిన మహిళ.. కాసేపటికే అరుపులు.. ఏంటా అని భర్త లోపలికి వెళ్లగా
సమాజంలో రోజురోజుకూ కామాందులు పెరిగి పోతున్నారు. ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలూ.. వారి వక్ర బుద్దికి పని చెబుతున్నారు. మృగాలలా వారిపై పడి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వాలు ఎంత కఠిన శిక్షు విధించినప్పటి ఎలా మార్పులు రావట్లేదు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది. స్కానింగ్ కోసం రేజియాలజిస్ట్‌కు వెళ్లిన మహిలపై నిర్వాహకుడు అఘాయిత్యానికి యత్నించాడు.

స్కానింగ్ కోసం రేడియాలజిస్టుకు వచ్చిన మహిళపై నిర్వాహకుడు అఘాయిత్యానికి యత్నించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల క్రితం ఒక మహిళ తన భర్తతో పాటు స్కానింగ్ చేయించుకునేందుకు అనేకల్‌లో రేడియాలజిస్టు సెంటర్‌కు వెళ్లింది. అయితే స్కానింగ్ కోసం మహిళ గదిలోకి వెళ్లగా ఆమె భర్త బయట హాల్‌లో కూర్చొని ఉన్నాడు.
అయితే అక్కడ రేడియాలజిస్టుగా పనిచేస్తున్న జయకుమార్ అనే వ్యక్తి.. స్కానింగ్ చేసే సమయంలో తన వక్రబుద్దిని బయటపెట్టాడు. స్కానింగ్ చేయించుకుంటున్న మహిళను లైంగికంగా వేధించాడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా.. బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ అతను చేసే పాడు పనిని నిశబ్ధంగా వీడియో తీసింది. ఆ తర్వాత భర్తతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సదురు రేడియాలజిస్ట్‌పై ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ ఘటన జరిగి వారం గడుస్తున్న నిందితుడిపై పోలీసులు చర్యలు తీసుకోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే నగర వ్యాప్తంగా నిరసనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
