Watch: ఏనుగులతో సెల్ఫీ కావాలా నాయనా..! ఎత్తి కుదేస్తే ఏమవుతుందో తెలుసా..? మీరే చూడండి..

యువకుల చేష్టలతో ఒక్కసారిగా రెచ్చిపోయిన గజరాజుల మంద వారి వెంట పడి పరుగెత్తించింది.. దీంతో వారు ప్రాణాలు అర చేతిలో పట్టుకుని పారిపోయేందు ప్రయత్నించారు. ఈ క్రమంలో కింద పడుతూ లేస్తూ పరుగులు పెట్టారు. ముగ్గురిలో ఓ యువకుడు పాపం కింద పడిపోయాడు. అంతలోనే ..

Watch: ఏనుగులతో సెల్ఫీ కావాలా నాయనా..! ఎత్తి కుదేస్తే ఏమవుతుందో తెలుసా..? మీరే చూడండి..
Arikomban Elephant
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 06, 2023 | 12:43 PM

గత కొంతకాలంగా ఏనుగులు జనావాసాల్లోకి వచ్చి నానా విధ్వంసం చేస్తున్నాయి. పంటలు, ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రజలకు భారీ నష్టాన్ని మిగిలుస్తున్నాయి. అయితే, గ్రామాలు, పట్టణాల్లోకి వచ్చిన గజరాజులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సందర్భంగా ముగ్గురు స్నేహితులు ఏనుగులతో సెల్ఫీ దిగబోయి ప్రమాదంలోంచి తృటిలో బయటపడ్డారు. ఈ సంఘటన యూపీ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగింది. ఏనుగుల దగ్గర సెల్ఫీలు దిగడం కోసం ప్రయత్నించిన ముగ్గురు స్నేహితులకు దాదాపు మరణం అంచులదాకా వెళ్లివచ్చినంత పనైంది. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాల కోసం పరుగెత్తుతున్నట్లు చూపిస్తుంది.

నెట్టింట చక్కర్లు కొడుతున్నఈ వీడియోలో ఏనుగుల గుంపుతో సెల్ఫీ దిగేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులకు ఏనుగులు చుక్కలు చూపించాయి. యువకుల చేష్టలతో ఒక్కసారిగా రెచ్చిపోయిన గజరాజుల మంద వారి వెంట పడి పరుగెత్తించింది.. దీంతో వారు ప్రాణాలు అర చేతిలో పట్టుకుని పారిపోయేందు ప్రయత్నించారు. ఈ క్రమంలో కింద పడుతూ లేస్తూ పరుగులు పెట్టారు. ముగ్గురిలో ఓ యువకుడు పాపం కింద పడిపోయాడు. కానీ మళ్లీ లేచి పరిగెత్తాడు. ముగ్గురు యువకులను ఏనుగుల మంద వెంబడించగా, అక్కడే ఉన్న ఓ యువకుడు ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌ కెమెరాలో బంధించాడు.

ఇవి కూడా చదవండి

యూపీలోని లఖింపూర్ ఖేరీలోని దుధ్వా టైగర్ రిజర్వ్ సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని (@AhteshamFIN) అనే వినియోగదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. ఇక ఈ వీడియోకి క్యాప్షన్‌లో ఇలా రాశారు..పాలియా గౌరీఫాంట రహదారి దృశ్యం ఇది. సుమారుగా ఓ 50 ఏనుగుల గుంపు రోడ్డు గుండా వెళ్తోంది అంటూ క్యాప్షన్‌లో పేర్కొన్నారు. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..