Watch: హైవేపై కరెన్సీ వర్షం.. ఎక్కడ చూసినా డబ్బే డబ్బు.. దొరికినోళ్లకు దొరికినంత!
అకస్మాత్తుగా ఆకాశం నుంచి డబ్బు వర్షం కురిస్తే ఎలా ఉంటుంది.. ! ఈ ఊహా కూడా అద్భుతంగా ఉంది కదూ..! సరిగ్గా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో స్థానిక ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు తమ వాహనాలను వదిలిపెట్టి డబ్బులు ఏరుకోవటంలో మునిగిపోయారు.
అకస్మాత్తుగా ఆకాశం నుంచి డబ్బు వర్షం కురిస్తే ఎలా ఉంటుంది.. ! ఈ ఊహా కూడా అద్భుతంగా ఉంది కదూ..! సరిగ్గా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిలిప్పీన్స్‌లో ఈ వింత దృగ్విషయం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా కోస్టల్ హైవేపై కరెన్సీ నోట్ల వర్షం మొదలైంది. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు తమ వాహనాలను వదిలిపెట్టి డబ్బులు ఏరుకోవటంలో మునిగిపోయారు. కానీ అది అద్భుతం కాదు. గాలిలో ఎగురుతున్న నోట్లు ఆకాశం నుండి పడటం లేదు. సిబూ సౌత్ కోస్టల్ రోడ్‌లో బైక్ నడుపుతున్న వ్యక్తి బ్యాక్‌ప్యాక్ చిరిగి పోవటంతో డబ్బు కట్టల్లోంచి నోట్లు ఎగిరిపడ్డాయి.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. సదరు వ్యక్తి కొన్ని వ్యాపారాలకు చెల్లింపులను తీసుకువెళుతున్నాడు. దాదాపు రూ.44 లక్షల నుంచి రూ.59 లక్షల వరకు ఉన్న డబ్బునంతా బ్యాగ్ లో పెట్టుకుని బైక్ పై బయల్దేరాడు. హైవేపై నడుచుకుంటూ వెళుతుండగా, తన బ్యాగ్ జిప్ ఎప్పుడు ఊడిపోయిందో కూడా తెలియదు. దాంతో నగదు మొత్తం రోడ్డుపై వెద్దజల్లినట్టుగా ఎగిరిపోయింది. వాస్తవానికి, ఇక్కడో వాహనదారుడు తనను అప్రమత్తం చేయకపోతే అతనికి ఈ విషయం చివరి వరకు తెలియ కుండానే ఉండేది.
ఈ విషయం తెలుసుకునే సరికి అతని బ్యాగులో నుంచి రూ.14 లక్షలకు పైగా నగదు బయటపడింది. అప్పటికే భారీగా జనం డబ్బులు ఎరుకునేందుకు కొన్ని వాహనాలను ఆపేందుకు ప్రయత్నించగా వెనక్కి వెళ్లలేకపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. వీడియోలు చాలా మంది ప్రజలు రోడ్డుపై పడిపోయిన నోట్లు ఎరుకుంటూ కనిపించారు. రోడ్డుపై నోట్ల వర్షం కురిసిందా అన్నట్టుగానే రోడ్డుపై చెల్లాచెదురుగా వేర్వేరు నోట్లు కనిపిస్తున్నాయి.
పోలీసులు కూడా ఆ వ్యక్తికి డబ్బు తిరిగి తీసి ఇవ్వడానికి సహాయం చేసారు. కానీ, ప్రజలు మాత్రం డబ్బు తిరిగి ఇవ్వలేదు. నివేదిక ప్రకారం, అధికారి మాట్లాడుతూ.. దొరికిన డబ్బు తిరిగి అతనికి ఇవ్వాలంటూ ప్రజల్ని కోరుతున్నామని చెప్పారు. కానీ, వారంతా డబ్బును తిరిగి ఇవ్వకపోతే, పాపం చేసేది ఏమీ లేదు.. బాధితుడే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుందని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..