Vande Bharat Train Fares: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలు తగ్గింపు..!

ప్రస్తుతం అనేక మార్గాల్లో చాలా వరకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి.. ఇలాంటి పరిస్థితిలో రైల్వేశాఖ ఇప్పుడు ఆయా మార్గాల్లో వందే భారత్ ఛార్జీలను తగ్గించే దిశగా సమీక్షిస్తోంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు తక్కువ డిమాండ్‌ ఉన్న చోట టికెట్‌ ధరలు తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Vande Bharat Train Fares: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలు తగ్గింపు..!
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 06, 2023 | 8:17 AM

Vande Bharat Express : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఎందుకంటే.. ఇప్పుడు మీరు కూడా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే అవకాశం వచ్చింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య మాత్రం అరకొరగానే ఉంటుంది. ప్రస్తుతం అనేక మార్గాల్లో చాలా వరకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి.. ఇలాంటి పరిస్థితిలో రైల్వేశాఖ ఇప్పుడు ఆయా మార్గాల్లో వందే భారత్ ఛార్జీలను తగ్గించే దిశగా సమీక్షిస్తోంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు తక్కువ డిమాండ్‌ ఉన్న చోట టికెట్‌ ధరలు తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని స్వల్ప-దూర వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సీట్లు ఇంకా పూర్తిగా నిండటం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఛార్జీలను తగ్గించే ఆలోచనలో రైల్వేశాఖ ఉంది.

నివేదికల ప్రకారం, ఇండోర్-భోపాల్, భోపాల్-జబల్‌పూర్, నాగ్‌పూర్-బిలాస్‌పూర్, మరికొన్ని రూట్లలో వందే భారత్ రైళ్ల ఛార్జీలను సమీక్షిస్తున్నారు. ఈ మార్గంలో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సీట్లు చాలా వరకు ఖాళీగా ఉంటున్నాయి. గణాంకాల ప్రకారం,.. ఇండోర్-భోపాల్ వందే భారత్ ప్రయాణ సమయం సుమారు మూడు గంటలు. ఇందులో జూన్‌లో 29 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. తిరిగి వస్తున్నప్పుడు ఈ రైలులో కేవలం 21 శాతం సీట్లు మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయి. ప్రస్తుతం ఈ రైలు ధర రూ.950. కాగా ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ ధర రూ.1525.

అదేవిధంగా, నాగ్‌పూర్-బిలాస్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 55 శాతం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. భోపాల్-జబల్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (4.5 గంటల ప్రయాణం)లో కూడా అన్ని సీట్లు రిజర్వ్ కావటం లేదు. నాగ్‌పూర్-బిలాస్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఎగ్జిక్యూటివ్ తరగతికి రూ. 2,045, చైర్ కార్‌కు రూ. 1,075. భోపాల్ నుండి జబల్‌పూర్‌కి AC చైర్ కార్‌కు రూ.1,055, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టిక్కెట్ ధర రూ.1,880. అయితే, తిరిగి వచ్చే ఛార్జీలు భిన్నంగా ఉంటాయి. AC కుర్చీకి రూ. 955, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌కి రూ.1790 ఖర్చవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్