How to clean silver at home: వెండి వస్తువులు కొత్తవాటిలా మెరవాలంటే ఈ సింపుల్‌ చిట్కాలు ట్రై చెయ్యండి!!

ఒక చెంచా బేకింగ్ సోడాలో కొంచెం నీరు వేసి చిక్కని పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌లో చిన్న కాటన్ గుడ్డను ముంచి వెండి ఆభరణాలపై సరిగ్గా రుద్దండి. ఇలా చేయడం వల్ల వెండి ఆభరణాలు, వెండి పూజా వస్తువులపై ఉన్న అన్ని నల్ల మచ్చలు తొలగిపోతాయి.

How to clean silver at home: వెండి వస్తువులు కొత్తవాటిలా మెరవాలంటే ఈ సింపుల్‌ చిట్కాలు ట్రై చెయ్యండి!!
Health Benefits Of Silver
Follow us

|

Updated on: Jul 05, 2023 | 12:50 PM

గతంలో రాష్ట్రాన్ని పాలించిన రాజ మహారాజులు వెండి, బంగారు వస్తువులు ఉపయోగించేవారని వింటుంటాం..ఈ రెండు లోహాలు ప్రాచీన కాలం నుండి సంపద, శ్రేయస్సుకు చిహ్నాలుగా ఉపయోగించబడుతున్నాయి. ఇప్పటికీ ఇదే కొనసాగుతోంది. ఈ రోజుల్లో వెండి కంటే బంగారానికి ఎక్కువ ఆదరణ ఉంది. ఈ కారణంగానే పసిడి ధర ఆకాశాన్ని అంటుతోంది! అలాగే కొన్ని గృహోపకరణాలు, పాత్రలు, దేవుళ్ల విగ్రహాలు మొదలైన వాటిలో వెండిని ఉపయోగిస్తుంటారు. వెండిని కాళ్లకు పట్టీలు, పిల్లలకు నడుము, కంకణాలు మొదలైన వాటిలో తరచుగా ఉపయోగిస్తారు. అయితే, చాలా సార్లు మనం ఉపయోగించే వెండి ఆభరణాలు, వస్తులు రంగుమారిపోతుంటాయి.! అలాంటప్పుడు వాటిని తిరిగి మెరిసేలా చేసేందుకు ఏం చేయాలో చాలా మంది తెలియదు.. కానీ, వెండి వస్తువులు కొత్తగా కనిపించేందుకు కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చింతపండు..

చింతపండు అంటే వెంటనే నోరూరుతుంది. చింతపండులోని ఆమ్ల గుణం వంట రుచిని పెంచుతుంది. వెండి ఆభరణాలు, వెండి విగ్రహాల నుండి మరకలను తొలగించడంలో చింతపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. చింతపండును నీటిలో కొద్దిగా ముంచి, వెండి విగ్రహం లేదా వెండితో చేసిన ఆభరణాలపై సరిగ్గా రుద్దండి. నల్ల మచ్చలు తొలగిపోయే వరకు రుద్దాలి.. ఆ తర్వాత శుభ్రమైన నీళ్లలో కడిగితే వెండి నగలు దేదీప్యమానంగా మెరిసిపోతాయి

టూత్ పేస్టు!

ముందుగా వెండి ఆభరణాలను నీళ్లలో ముంచి, దానిపై టూత్ పేస్టును రాసి, వేళ్ల సహాయంతో నెమ్మదిగా రుద్దితే వెండి వస్తువులు, ఇతర వెండి ఆభరణాలతో చేసిన దేవుని విగ్రహంపై ఉన్న మరకలు తొలగిపోయి మెరుస్తాయి.

ఇవి కూడా చదవండి

టమాటో కెచప్!

చాలామంది శాండ్‌విచ్‌లు లేదా సమోసాలతో పాటు టమోటా కెచప్‌తో తినడానికి ఇష్టపడతారు. అయితే వెండి ఆభరణాలను క్లీన్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు! దీని కోసం కొన్ని టొమాటో కెచప్‌ను సన్నని టవల్‌పై ఉంచి, మరక ఉన్న భాగంలో సరిగ్గా రుద్దండి. ఆ తర్వాత నీళ్లతో కడిగి శుభ్రం చేసుకోవాలి.

ఇక్కడ మరిన్ని చిట్కాలు ఉన్నాయి..

* ఒక చిన్న గిన్నెలో కొంచెం వేడి నీళ్ళు పోసి, దానికి ఒక టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ వేసి, మిక్స్ చేసి నురుగులా చేయాలి. ఆ తర్వాత ఈ నీటిలో వెండి ఆభరణాలు వేయాలి. దాదాపు పది నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత శుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి.

* ఒక చిన్న బకెట్‌లో గోరువెచ్చని నీటితో నింపండి అందులో సగం కప్పు వైట్ వెనిగర్, రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. తర్వాత సుమారు రెండు మూడు గంటల పాటు ఈ మిశ్రమంలో వెండి వస్తువులు, ఆభరణాలు వేసి నాననివ్వాలి. దీని తరువాత నీటితో కడగాలి. శుభ్రమైన గుడ్డతో తుడవండి.

* ఒక చెంచా బేకింగ్ సోడాలో కొంచెం నీరు వేసి చిక్కని పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌లో చిన్న కాటన్ గుడ్డను ముంచి వెండి ఆభరణాలపై సరిగ్గా రుద్దండి. ఇలా చేయడం వల్ల వెండి ఆభరణాలు లేదా వెండి పూజా వస్తువులపై ఉన్న అన్ని నల్ల మచ్చలు తొలగిపోతాయి.

పోహా ఫింగర్స్.. చికెన్‌ని కూడా డామినేట్ చేస్తాయి..
పోహా ఫింగర్స్.. చికెన్‌ని కూడా డామినేట్ చేస్తాయి..
మార్కెట్లో తాజాగా ఉండే చేపలను ఎలా కనిపెట్టాలంటే..
మార్కెట్లో తాజాగా ఉండే చేపలను ఎలా కనిపెట్టాలంటే..
చీరకట్టులో తళుక్కుమన్న రాకింగ్ స్టార్ భార్య.. లేటెస్ట్ ఫొటోస్
చీరకట్టులో తళుక్కుమన్న రాకింగ్ స్టార్ భార్య.. లేటెస్ట్ ఫొటోస్
ధన్‌తేరస్‌కు 10 రోజుల ముందు రికార్డు స్థాయిలో బంగారం ధరలు..
ధన్‌తేరస్‌కు 10 రోజుల ముందు రికార్డు స్థాయిలో బంగారం ధరలు..
మీ బ్రెయిన్ స్పీడుగా పని చేయాలంటే.. ఇవి తింటే సరిపోతుంది..
మీ బ్రెయిన్ స్పీడుగా పని చేయాలంటే.. ఇవి తింటే సరిపోతుంది..
రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తింటే మందులతో పనే ఉండదు..
రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తింటే మందులతో పనే ఉండదు..
టాటా స్టీల్‌ను కాపాడేందుకు తన ఉద్యోగాన్ని వదులుకున్న రతన్‌ టాటా
టాటా స్టీల్‌ను కాపాడేందుకు తన ఉద్యోగాన్ని వదులుకున్న రతన్‌ టాటా
ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే ముందు ఇవి గమనించారా? లేకుంటే మోసపోతారు!
ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే ముందు ఇవి గమనించారా? లేకుంటే మోసపోతారు!
ఈ న్యూస్ వింటే షాక్ అవుతారు.. సాంబార్‌తో క్యాన్సర్‌‌కు చెక్!
ఈ న్యూస్ వింటే షాక్ అవుతారు.. సాంబార్‌తో క్యాన్సర్‌‌కు చెక్!
ఈ బ్యాంకుల్లో డిపాజిట్స్‌ చేస్తున్నారా? వడ్డీ రేట్లు ఇలా..
ఈ బ్యాంకుల్లో డిపాజిట్స్‌ చేస్తున్నారా? వడ్డీ రేట్లు ఇలా..