Watch: మూడేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన యజమాని.. వారి పెంపుడు కుక్క ఏం చేసిందో చూడండి..

కుక్కలు మనిషికి మంచి స్నేహితులు. అవి తమ యజమాని పట్ల అత్యంత ప్రేమ, అప్యాయతలను చూపుతుంటాయి. ఎప్పటికీ వారితోనే ఉండాలని కోరుకుంటాయి. ఈ విషయాల్లో కుక్కలు మనుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ భావోద్వేగంతో ఉంటాయి. తమ ప్రియమైన వారిని విడిపోవడం కుక్కలు తట్టుకోలేవు.

Watch: మూడేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన యజమాని.. వారి పెంపుడు కుక్క ఏం చేసిందో చూడండి..
Dog
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 05, 2023 | 10:31 AM

ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసం గల జీవి ఏదైనా ఉందంటే అది కుక్క మాత్రమే. కుక్కల విశ్వాసం గురించి ఇప్పటికే చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో అనేకం చూశాం. కుక్కలు మనిషికి మంచి స్నేహితులు. అవి తమ యజమాని పట్ల అత్యంత ప్రేమ, అప్యాయతలను చూపుతుంటాయి. ఎప్పటికీ వారితోనే ఉండాలని కోరుకుంటాయి. ఈ విషయాల్లో కుక్కలు మనుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ భావోద్వేగంతో ఉంటాయి. తమ ప్రియమైన వారిని విడిపోవడం కుక్కలు తట్టుకోలేవు. యజమానికి దూరమైన కుక్కలు,..వారి కోసం ఎంతగానో తపిస్తాయి. ఎంతకాలానికి వారు తిరిగి వచ్చినా సరే వారిని చూడగానే సంతోషంతో అవి చేసే సందడి అంతఇంతా ఉండదు. ఇక్కడ కూడా అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా కాలం తర్వాత తిరిగి వచ్చిన తన యజమానిని చూసిన ఒక జర్మన్ షెపర్డ్ జాతి కుక్క ఆనందం చూడాల్సిందే..

ఈ వీడియోలో జర్మన్‌ షెపర్డ్‌ జాతి కుక్క తన యజమానిని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న దృశ్యం కనిపించింది. కుక్క ఒక్కటే ఇంటి మెట్లపై కూర్చొని ఉంది, ఈ సమయంలో కుక్క యజమాని కారులో వచ్చాడు. అది చూసిన ఆ శునకం..కుక్క గోడపై నుండి కిందకు దూకేసింది… ఒక్క పరుగున వెళ్లి అతన్ని పట్టేసుకుంది. అతనిపైకి దూకి చుట్టూ తిరగడం ప్రారంభించింది. కారు దగ్గరకు వెళ్లిన కుక్క మరోసారి చెట్టు దగ్గరకు వచ్చి దూకింది. కుక్క అలసిపోయేంత వరకు అదే ఆవేశంతో తన యజమానిని కౌగిలించుకుంది. ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈవీడియో @realkingsgive అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా పోస్ట్ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటికే10 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. వీడియో చూసిన చాలా మంది హార్ట్ ఎమోజీతో కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

నేను బయటకు వెళ్లి తిరిగి వచ్చిన ప్రతిసారి నా కుక్క కూడా ఇలాగే ప్రవర్తిస్తుందని కొందరు చెప్పగా, కుక్కలు తమ యజమానులను ఎప్పటికీ మర్చిపోవని, వారిని ఎప్పుడూ గుర్తుంచుకుంటాయని మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..