కేదార్‌నాథ్ ఆలయం ముందు సినిమా స్టైల్‌లో ప్రియుడికి ప్రపోజ్ చేసిన మహిళ.. మండిపడుతున్న జనాలు.. వీడియో వైరల్‌..

అత్యంత పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు అతి పవిత్రంగా భావించే గుడి ముందు ప్రియుడికి ప్రపోజ్ చేస్తున్న అమ్మాయికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

కేదార్‌నాథ్ ఆలయం ముందు సినిమా స్టైల్‌లో ప్రియుడికి ప్రపోజ్ చేసిన మహిళ.. మండిపడుతున్న జనాలు.. వీడియో వైరల్‌..
Kedarnath Temple
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 05, 2023 | 8:16 AM

సోషల్ మీడియా మన జీవితాల్లో అత్యంత ప్రేరేపిత కారకాల్లో ఒకటి. ప్రజలు తమ వివరాలన్నింటినీ సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో పంచుకుంటారు. ఫేమస్‌ అవ్వాలనే కోరిక, లైకుల కోసం షేర్‌చేసేవి కొన్ని విషయాలు వైరల్‌గా మారి జనాలు లైక్ చేస్తుంటే, కొన్ని వివాదాలకు, విమర్శలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో షేర్ చేసిన అలాంటి వీడియో ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతోంది. అత్యంత పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు అతి పవిత్రంగా భావించే గుడి ముందు ప్రియుడికి ప్రపోజ్ చేస్తున్న అమ్మాయికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ప్రేమికులు తమ భాగస్వాములను ఆశ్చర్యపరిచేందుకు ఎన్నో పనులు చేస్తుంటారు. ప్రేమలో ఉన్నవారు.. తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. చారిత్రక కట్టడాలు, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల ముందు తమ భాగస్వామికి ప్రపోజ్‌ చేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి దృశ్యాలు మీరు చాలా చూసి ఉంటారు. కానీ, గుడి ముందు ఎవరైనా ప్రపోజ్ చేయడం చూశారా? అది కూడా అత్యంత పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయంలో…!!

ఈసారి చాలా మంది భక్తులు కేదార్‌నాథ్ ధామ్‌కు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఈ క్రమంలోనే కేదార్‌నాథ్ ఆలయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాదానికి దారితీసింది. ఈ వీడియోలో ఆలయ ప్రాంగణంలో నిలబడి ఒక అమ్మాయి తన ప్రియుడికి ప్రపోజ్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో  పసుపు రండు దుస్తులు ధరించిన అమ్మాయి, ఆమె ప్రియుడి ముందు నిలబడి ఉంది. ఇద్దరూ ఆలయం ముందు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇంతలో అమ్మాయి ఏవో సైగలు చేస్తుంది. అంతలో ఒక వ్యక్తి వారికి వెనుక నుండి ఉంగరాన్ని అందజేస్తాడు. ఆ తర్వాత ఆ యువతి మోకాళ్లపై నిలబడి తన ప్రేమను ప్రియుడికి తెలియజేసింది. ప్రియురాలు ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో అతడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమగా ఆలింగనం చేసుకోవడం వీడియోలో కనిపిస్తుంది. అయితే, వీళ్లు భార్యభర్తలేనని, ఈ వీడియో కూడా గత రెండు మూడు రోజుల క్రితం నాటిదేనని తెలిసింది.

అయితే, కేదార్ నాథ్ యాత్రకు వెళ్లిన భార్యాభర్తల వీడియో మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గుడి ఆవరణలో ప్రియుడిపై అమ్మాయి తన ప్రేమను చూపడంపై ప్రజలు రకరకాలుగా స్పందిస్తున్నారు. పవిత్ర ప్రదేశాల్లో ఇలాంటి పనులు తప్పని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆలయాల్లో పెళ్లిళ్లు చేస్తే తప్పేమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇలాంటి చోట్ల ఫోన్లు బ్యాన్ చేయాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వీడియోలు, పనులు ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నాయని పలువురు మండిపడుతున్నారు.

వీడియోలో కనిపిస్తున్న మహిళ విశాఖ అనే బ్లాగర్. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో (@ridergirlvishakha) ఈ రీల్‌ను కూడా షేర్ చేసింది. అంతా ప్లాన్‌ ప్రకారమే జరిగిందని చెప్పారు. మ్యాచింగ్ బట్టలు, ఉంగరం, ప్రయాణ ప్రణాళికలు అన్నీ.. భోలేనాథ్ ఆశీస్సులతో తన కల నెరవేరిందని చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే