అందంగా కనిపించేందుకు పక్షి రెట్టలను ముఖానికి పూస్తారట..ఇదే వారి సీక్రెట్..! ధర ఎంతో తెలుసా..?
అందంగా కనిపించాలనేది అందరి కోరిక. ఇందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే, ఇక్కడి ప్రజలు అందంగా కనిపించేందుకు తమ ముఖాలపై పక్షుల రెట్టలను ఉపయోగిస్తారు.
Updated on: Jul 05, 2023 | 1:57 PM

జపాన్‌లో పక్షుల రెట్టలను ఉపయోగించి ఫేషియల్‌లు తయారు చేస్తున్నారు. ఇందులో వారు పక్షి మలాన్ని ముఖంపై మసాజ్ చేస్తారు. ఇది చర్మం మృదువుగా మారుతుందని నమ్ముతారు.

బర్డ్ ఫేషియల్ అనేది ఇటీవలి చికిత్స కాదు. ఇది చికిత్స పురాతన పద్ధతి.17వ శతాబ్దంలో, జపనీస్ డ్యాన్సర్లు, కళాకారులు తమ మేకప్‌ను తొలగించిన తర్వాత చర్మంపై అప్లై చేసేవారట.

ఈ చికిత్సను నైటింగేల్ పూప్ ఫేషియల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది నైటింగేల్ రెట్టలను ఉపయోగిస్తుంది.

జపనీస్ ద్వీపం క్యుషులో కనిపించే నైటింగేల్స్ మలమూత్రాలను ఫేషియల్ కోసం సేకరిస్తారు. చర్మంపై అప్లై చేసి స్మూత్‌గా మసాజ్ చేస్తారు.

రిపోర్ట్‌ల ప్రకారం, బర్డ్ పూప్ ఫేషియల్ చేయడం వల్ల వృద్ధాప్య సంకేతాలు దూరం చేస్తుంది. అంతే కాదు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

పక్షి పూప్ ఫేషియల్ ధర రూ.14 వేల నుండి 18 వేల వరకు ఉంటుంది. ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్హాంతన భార్య విక్టోరియా ముఖంపై అదే ఫేషియల్‌ను ఉపయోగించాడని సమాచారం.





























