- Telugu News Photo Gallery Political photos SCO Summit 2023: PM Modi refrains from extending support to China's Belt and Road Initiative
PM Modi: ఉగ్రవాదం ఏ రూపంలోనైనా ఉండొచ్చు.. ఎస్‌ఈవో సమ్మిట్‌లో పాక్, చైనాల దుమ్ముదిలిపిన ప్రధాని మోదీ..
SCO Summit 2023: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (జూలై 04) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పు అని ప్రధాని అభివర్ణించారు.
Updated on: Jul 05, 2023 | 9:11 AM

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (జూలై 04) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.

కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని తమ విధానాల సాధనంగా ఉపయోగించుకుంటున్నాయని.. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయని పాకిస్థాన్ పేరు చెప్పకుండా ప్రధాని మోదీ అన్నారు. అటువంటి దేశాలను విమర్శించడానికి SCO వెనుకాడదని ప్రధాని మోదీ అన్నారు.

ఎస్‌సీఓ సమావేశంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్ నేతలు కూడా పాల్గొన్నారు.

ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పుగా అభివర్ణించిన ప్రధాన మంత్రి, ఈ సవాలును ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్య అవసరమని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలోనైనా ఉండొచ్చు దానికి వ్యతిరేకంగా మనం కలిసి పోరాడాలన్నారు.

వివిధ దేశాలను అనుసంధానం చేసేందుకు చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ) ప్రాజెక్టుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఒక సంస్థగా మన ప్రజల ఆకాంక్షలు, ఆకాంక్షలను నెరవేర్చగల సామర్థ్యం ఉందా లేదా అని కలిసి ఆలోచించాలని ప్రధాని మోదీ అన్నారు. ఆధునిక సవాళ్లను మనం ఎదుర్కోగలుగుతున్నామా..? భవిష్యత్తు కోసం పూర్తిగా సిద్ధమైన సంస్థగా ఎస్‌సిఓ మారుతోందా? అని ప్రశ్నించారు.

ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించి, ఆఫ్ఘన్ పౌరులకు మానవతా సహాయం, సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాటం, మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కులను నిర్ధారించడం మా సాధారణ ప్రాధాన్యతలని ప్రధాని మోదీ చెప్పారు.

SCO సంస్కరణలు, ఆధునీకరణ ప్రతిపాదనకు భారతదేశం మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ఇరాన్ ఎస్‌సిఓ కుటుంబంలో కొత్త సభ్యునిగా చేరబోతున్నందుకు తాను సంతోషంగా ఉన్నానని.. ఈ సంర్భంగా ఇరాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ.
