Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చేతిలో గన్‌తో జ్యువెలరీ షాపులో దూరిన దొంగ.. నగలు మొత్తం మూటగట్టాలన్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

సమయస్పూర్తి, ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చనేది వాస్తవం. అలాగే ఐకమత్య బలం ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైన ఎదుర్కొవడం ఈజీ అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాంటిదే ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Watch: చేతిలో గన్‌తో జ్యువెలరీ షాపులో దూరిన దొంగ.. నగలు మొత్తం మూటగట్టాలన్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Thief With Gun
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 06, 2023 | 1:53 PM

ఎవరైనా తుపాకీతో భయపెట్టేందుకు వస్తే.. భయంతో అందరూ వణికిపోవడం సహజం. దానికితోడు ఆ దుండగుడు ఎక్కడ కాల్చేస్తాడోననే భయంతో ఎక్కడి వారు అక్కడే నక్కి ప్రాణాలు కాపాడుకుంటారు. అయితే, ప్రతిసారి దొంగలకు సమయం అనుకూలంగా ఉండదు.. ప్రజలు చూపే సమయస్పూర్తి, వివేకం, ఐక్యత ఎలాంటి క్రూర నేరగాడినైనా సరే భయపెట్టేలా చేస్తాయి. వారిని పట్టుకుని జైల్లో వేసేలా చేస్తాయి. ఇది కూడా అలాంటి సంఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అలాంటి వీడియో ఒకటి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ఒక దొంగ పిస్టల్‌తో నగల దుకాణంలోకి ప్రవేశించిన దృశ్యం ఇది. సీసీ టీవీ కెమెరాలో రికార్డైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముఖానికి ముసుగు ధరించిన ఒక దుండగుడు చేతిలో తుపాకీ పట్టుకుని ఓ జ్యూవెలరీ షాపులోకి దూరాడు. షాపులోని సిబ్బందిని బెదిరించి చోరీ చేసేందుకు యత్నించాడు. దీంతో అక్కడి వారంతా ఒక్క క్షణం షాక్ అయ్యారు. దొంగ తుపాకీని చూపించి మరింత బెదిరించడం ప్రారంభించాడు. ఈ సందర్భంలో అనుకోని సంఘటన జరుగుతుంది. అదేంటంటే.. తుపాకీతో బెదిరింపులకు దిగిన దొంగను పక్కనే ఉన్నవాళ్లు చాకచక్యంగా నేలకేసి కొట్టారు. తప్పించుకోకుండా గట్టిగా పట్టుకున్నారు. ఈ దృశ్యం నగల వ్యాపారి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది.

ఇవి కూడా చదవండి

జైపూర్‌లో జరిగిన ఈ సంఘటన మొత్తం వీడియోలో కనిపిస్తుంది. అయితే, ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాన్ని నెటిజన్లు ఎంతో ఉత్సుకతతో చూస్తున్నారు. ప్రజల ఐక్యతను కూడా కొనియాడారు. ప్రస్తుతం ఈ వీడియో చాలా వ్యూస్‌ని సొంతం చేసుకుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..