Viral Video: ముఖం మీద వింత ప్రయోగం.. మేకప్ అవసరం లేకుండా టాటూ వేయించుకున్న యువతి..
యువతలో రోజు రోజుకీ టాటూల క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. శరీరం మీద ఎక్కడైనా సరే పచ్చబొట్లు వేయించుకునే పరిస్థితి నెలకొంది. అయితే కొన్నిసార్లు ప్రజలు వింత పచ్చబొట్లు వేయించుకుని వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఒక యువతి వేయించుకున్న టాటూ ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కరు కొడుతోంది. ఓ యువతి తన ముఖంపై ఓ టాటూను వేయించుకుంది. దీని కారణంగా ఇప్పుడు ఆ యువతికి జీవితాంతం మేకప్ అవసరం ఉండదు.

ఒకప్పటి పచ్చబొట్టు నేటి టాటూగా మారాయి. కొతమంది సింపుల్ గా చేతిపై పచ్చబొట్టు వేయించుకుంటే.. మరికొందరు వీపుపై , మెడపై టాటూలను వేయించుకుంటున్నారు. మరికొందరు ఇంకొక్క అడుగు ముందుకేసి శరీరం మీద ఎక్కడైనా పచ్చబొట్టు వేయించుకుంటున్నారు. ఈ టాటూల ప్రభావం సామాన్యులపైనే కాదు.. బాలీవుడ్ సూపర్ స్టార్లు, క్రికెటర్లల్లో కూడా కనిపిస్తోంది. అవును యువతలో రోజు రోజుకీ టాటూల క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. శరీరం మీద ఎక్కడైనా సరే పచ్చబొట్లు వేయించుకునే పరిస్థితి నెలకొంది. అయితే కొన్నిసార్లు ప్రజలు వింత పచ్చబొట్లు వేయించుకుని వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఒక యువతి వేయించుకున్న టాటూ ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కరు కొడుతోంది. ఓ యువతి తన ముఖంపై ఓ టాటూను వేయించుకుంది. దీని కారణంగా ఇప్పుడు ఆ యువతికి జీవితాంతం మేకప్ అవసరం ఉండదు.
అమ్మాయిల మేకప్ గురించి రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. మేకప్ కు అయ్యే సమయం, దాని ఖర్చులను ఎగతాళి చేసే వ్యక్తులను తరచుగా చూసి ఉంటారు.. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఓ యువతి వింతగా టాటూ వేయించుకుని వార్తల్లో నిలిచింది. ఆమె తన ముఖంపై అద్భుతమైన టాటూ వేయించుకుంది. దీని కారణంగా ఇప్పుడు ఆమెకు మేకప్ అవసరం ఉండదు. ఇప్పుడు ఈ ఆలోచన సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా ఆశ్చర్యానికి గురై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇక్కడ వీడియో చూడండి
View this post on Instagram
ఓ యువతి తన బుగ్గపై టాటూని మేకప్ స్టైల్ లో వేయించుకోవడం వీడియోలో చూడవచ్చు. పింక్ కలర్ సిరాతో ఓ టాటూ ఆర్టిస్ట్ యువతి బుగ్గలపై టాటూ వేస్తున్నాడు., ఈ టాటూ కంప్లీట్ అయిన.. మేకప్ లుక్ వచ్చేలా ఒక క్లాత్ తో తుడిచాడు. కొంత సమయం తరువాత.. ఆ యువతి ముఖం సరిగ్గా బుగ్గలకు మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది.
ఈ వీడియో Instagramలో @aishroyal_salon_hoshiarpur అనే ఖాతాతో షేర్ చేశారు. ఇప్పటికే వేలాది మందని ఈ వీడియోను లైక్ చేయగా.. లక్షలాది మంది చూసి, రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ వీడియోపై ఒకరు స్పందిస్తూ ‘ఈ పద్ధతితో మీరు మీ ముఖాన్ని పాడు చేసుకుంటున్నారు.. అంతకు తప్ప మరేమీ లేదని కామెంట్ చేశారు.’ మరొకరు, ‘డబ్బు ఖచ్చితంగా ఆదా అవుతుంది.. అయితే ముఖం పూర్తిగా పాడైంది’ అని వ్యాఖ్యానించారు. రకరకాలుగా నెటిజన్లు ఈ యువతి మేకప్ ట్రిక్.. టాటూ పై కామెంట్స్ చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




