AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వారంలో ఒక రోజు పని, 6 రోజుల వీకాఫ్.. జాబ్ ఆఫర్ అనుకునేరు.. విషయం తెలిస్తే బుర్రపాడే

వారానికి ఒక్క రోజు విశ్రాంతి దొరకడమే గగనంగా మారిన రోజులు ఇవి. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, కొన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, ఐటీ పరిశ్రమలలో మాత్రమే వారానికి 2 రోజుల విరామం ఉంటుంది. మరికొన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఇంకో అడుగు ముందుకేసి వారంలో 4 రోజులు పని..

Viral: వారంలో ఒక రోజు పని, 6 రోజుల వీకాఫ్.. జాబ్ ఆఫర్ అనుకునేరు.. విషయం తెలిస్తే బుర్రపాడే
Representative Image
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Jul 12, 2024 | 1:02 PM

Share

వారానికి ఒక్క రోజు విశ్రాంతి దొరకడమే గగనంగా మారిన రోజులు ఇవి. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, కొన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, ఐటీ పరిశ్రమలలో మాత్రమే వారానికి 2 రోజుల విరామం ఉంటుంది. మరికొన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఇంకో అడుగు ముందుకేసి వారంలో 4 రోజులు పని, 3 రోజుల విరామం అందిస్తున్నాయి. ఇంతకు మించి ప్రపంచంలో మరెక్కడా విరామం వెసులుబాటు లేదు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో వారికి వారంలో ఒక రోజు మాత్రమే పని. మిగతా 6 రోజులు విశ్రాంతి. అది కూడా తామున్న చోటకు 1,500 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశానికి ఉదయం విమానంలో వెళ్లి, సాయంత్రానికి మళ్లీ విమానంలోనే తిరిగొచ్చేస్తారు. ఇంత దర్జా వెలగబెట్టే ఉద్యోగం ఏంటా అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం.

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

ముంబై మహానగరంలో ఈ మధ్య ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయి. ఈ దోపిడీ ముఠా ఒక ప్రత్యేక శైలిలో ఈ నేరాలకు పాల్పడుతోంది. తోటి ప్రయాణికుల మాదిరిగా మాట కలుపుతారు. చనువు తీసుకుని టీ-కాఫీ వంటి పానీయాలను ఆఫర్ చేస్తారు. ఎదుటివారికి నమ్మకం కలిగించేందుకు వారు కూడా తీసుకుంటారు. కానీ మాయచేసి క్షణాల్లో మత్తుమందు కలిపేస్తారు. ప్రయాణికులు మత్తులోకి జారుకోగానే, వారి దగ్గరున్న విలువైన ఆభరణాలు, వస్తువులు స్వాహా చేసి దిగిపోతారు. ముంబైలోని బస్సుల్లో, లోకల్ రైళ్లలో ఈ తరహా దోపిడీలు జరుగుతున్నాయి. అయితే ఇవి వారానికి ఒక రోజు మాత్రమే జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మాతుంగా పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ డెక్కర్ బస్సులో ఓ మహిళను ఇలాగే దోచుకున్న ఘటన వెలుగుచూసింది. ఆ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు తమకు దొరికి తీగలాగితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో డొంక కదిలింది. ఢిల్లీ సమీపంలోని మీరట్‌లో ఉండే ఓ ముఠా.. వారానికి ఒక రోజు ఈ దోపిడీ ఆపరేషన్ చేపడుతున్నట్టు గుర్తించారు. మీరట్‌లోని షహనత్తన్‌కు చెందిన యూనస్‌ను అరెస్టు చేసి, అతని సహచరుల కోసం బ్రహ్మపురిలో సోదాలు జరిపారు. అయితే అప్పటికే మిగతా నిందితులు పారిపోయారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే

ఉదయం వస్తారు, సాయంత్రం వెళ్తారు..

ఈ ముఠా మీరట్‌ నుంచి తెల్లవారుజామున బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. అక్కణ్ణుంచి విమానంలో ముంబై చేరుకుంటారు. బంగారం ఎక్కువగా ధరించిన మహిళలను టార్గెట్ చేసి దోచుకుంటారు. ఆ వెంటనే మళ్లీ ముంబై విమానాశ్రయానికి వచ్చి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కార్లోనే మీరట్‌కు చేరుకుంటారు. ఇదంతా ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే దినచర్య. అది కూడా వారంలో ఒక్క రోజే. మరో 6 రోజులు విశ్రాంతి తీసుకుని, మళ్లీ తమ దోపిడీ ఆపరేషన్ మొదలుపెడతారు. అంటే వారంలో ఒక రోజు మీరట్‌కు 1,500 కిమీ దూరంలో ఉన్న ముంబైలో పని చేసి తిరిగొస్తారన్న మాట. ముంబై పోలీస్ విభాగంలోని సంతోష్ మాలిక్ ఇప్పుడు ఈ గ్యాంగ్‌ను వేటాడుతున్నారు.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?