IPL 2025: అంబానీ మావా.! ఇది కదా కావాల్సింది.. వచ్చే ఐపీఎల్‌కూ ముంబైలోనే హిట్‌మ్యాన్‌

డిసెంబర్‌లో ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం జరగనుంది. దీనికి ముందుగా ఒక్కో జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఐపీఎల్‌కి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను..

Ravi Kiran

|

Updated on: Jul 11, 2024 | 8:54 PM

డిసెంబర్‌లో ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం జరగనుంది. దీనికి ముందుగా ఒక్కో జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఐపీఎల్‌కి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను విడుదల చేయకూడదని ముంబై ఇండియన్స్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

1 / 5
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ.. జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దీంతో ముంబై ఇండియన్స్‌కు ఇది రోహిత్ శర్మ చివరి సీజన్ అని సోషల్ మీడియాలో విపరీతంగా రూమర్స్ వైరల్ అయ్యాయి.

2 / 5
అయితే ముంబై ఫ్రాంచైజీ తాజాగా రోహిత్ శర్మను రిటైన్ చేసుకోవడంపై కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టులో స్టార్ ప్లేయర్ల కొరత బాగా ఉంది. హిట్‌మ్యాన్‌ను పక్కన పెడితే, అది ఖచ్చితంగా జట్టు బ్రాండ్‌పై ప్రభావం పడుతుంది. కెప్టెన్సీ నుంచి తప్పించినా.. ముంబై స్టేడియంలో రోహిత్ శర్మకు ఫ్యాన్స్ నుంచి ఎంతటి మద్దతు లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

3 / 5
ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును చాంపియన్‌గా నిలబెట్టి క్రేజ్‌ను కూడా సంపాదించాడు రోహిత్ శర్మ. దీంతో, హిట్‌మ్యాన్ జట్టు నుండి విడుదల చేస్తే, అది ఫ్రాంచైజీ బ్రాండ్‌పై భారీగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. అందుకే మెగా వేలానికి ముందే రోహిత్ శర్మను జట్టులో ఉంచాలని ముంబై ఇండియన్స్ ప్లాన్ చేస్తోంది.

4 / 5
దీని ప్రకారం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే విషయంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లను అట్టిపెట్టుకుంటుందని తెలుస్తోంది.

5 / 5
Follow us