AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే

ఈ 'ఆషాఢం' హిందూ చాంద్రమాన క్యాలెండర్‌లో నాల్గవ నెల. ఆషాఢ మాసం దక్షిణాయన పర్వ ఋతువులో జేష్ఠమాసం అమావాస్య మరుసటి రోజు పాడ్య తిథి నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం ఆషాఢ మాసం జూలై 6న ప్రారంభమై ఆగష్టు 4న ముగుస్తుంది...

Viral: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే
Representative Image
Ravi Kiran
|

Updated on: Jul 11, 2024 | 1:33 PM

Share

ఈ ‘ఆషాఢం’ హిందూ చాంద్రమాన క్యాలెండర్‌లో నాల్గవ నెల. ఆషాఢ మాసం దక్షిణాయన పర్వ ఋతువులో జేష్ఠమాసం అమావాస్య మరుసటి రోజు పాడ్య తిథి నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం ఆషాఢ మాసం జూలై 6న ప్రారంభమై ఆగష్టు 4న ముగుస్తుంది. ఈ మాసంలో కొత్తగా పెళ్లైన మహిళలు తమ పుట్టింటికి వచ్చే సంప్రదాయం ఉంది. ఆషాడమాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు కలిసి ఉండకూడదని అని అంటారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు దూరంగా ఉంటారు. అందుకే ఈ సమయంలో నవవధువులు తమ పుట్టింటికి వెళ్లడం ఆనవాయితీగా మారింది. ఈ సమయంలో భార్యాభర్తలు గర్భం ధరిస్తే చైత్రమాసంలో సంతానం కలుగుతుంది. అనగా ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తల్లికి, బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని శాస్త్రీయంగా ఇది కారణమని చెబుతుంటారు. అంతే కాదు ఈ మాసంలోని వాతావరణంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. చల్లని వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ల అంటువ్యాధులు బాగా ప్రబలతాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం. పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం, ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

కాబట్టి ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండటమే క్షేమమని పెద్దలు ఆచారంగా పెట్టారు. దీన్ని అనారోగ్య మాసంగా పేర్కొంటారు. ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది. కాలువల్లోనూ, నదుల్లోనూ ప్రవహించే నీరు అపరిశుభ్రంగా ఉంటుంది. మలినాలతో కూడిన నీరు వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇవన్నీ గర్భిణీ ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో కడుపులో పిండం కూడా అనారోగ్యం బారిన పడుతుంది. అలాగే ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచి రోజులే ఉంటాయి. ఆ శుభ ఘడియల్లో గర్భధారణ జరిగితే- మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. ఆషాడంలో గర్భం దాల్చితే తొమ్మిది నెలలకి అంటే చైత్రం పూర్తవుతుంది. అంటే నిండు వేసవిలో ప్రసవం జరుగుతుంది. ఆ సమయంలో ఎండలకు పుట్టిన పిల్లలు, బాలింతలు తట్టుకోలేరని ఈ నియమం పెట్టారు. అలాగే ఒక నెల వియోగం తర్వాత కలుసుకుంటే అన్యోన్యత దాంపత్యాన్ని పొందుతారని అని అంటారు కూడా.

పూర్వకాలంలో కొత్తగా పెళ్లైన యువకులు ఆరు నెలలపాటు అత్తగారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి పనిచేయాల్సిన యువకులు అత్తవారింట్లో కూర్చుంటే వ్యవసాయ పనులు సకాలంలో జరగవు. వర్షాధారంగా పంటలు పండించుకోవడం వల్ల సకాలంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా ఆకలితో మాడిపోవాల్సిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లో ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వైపు చూడకూడదనే నియమం పెట్టారు.

ఇది చదవండి: ఆడది కాదు.. ఆడపులి.! ఒంటిచేత్తో భారీ కొండచిలువను ఎలా ఉడుంపట్టు పట్టిందో చూస్తే

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి