AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: నదిలో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తోన్న బాలిక.. కట్ చేస్తే.. సెకన్లలో సీన్ రివర్సయింది

ఒక కుటుంబం తమ వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు ఓ ప్రాంతానికి వెళ్లారు. ఇక ఆ కుటుంబంలోని 12 ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న ఓ నదిలో సరదాగా ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తుండగా.. ఊహించని సీన్ చోటు చేసుకుంది. ఆమె ఆనందం క్షణాల్లో ఆవిరైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Viral: నదిలో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తోన్న బాలిక.. కట్ చేస్తే.. సెకన్లలో సీన్ రివర్సయింది
Representative Image `1
Ravi Kiran
|

Updated on: Jul 11, 2024 | 12:53 PM

Share

ఒక కుటుంబం తమ వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు ఓ ప్రాంతానికి వెళ్లారు. ఇక ఆ కుటుంబంలోని 12 ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న ఓ నదిలో సరదాగా ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తుండగా.. ఊహించని సీన్ చోటు చేసుకుంది. ఆమె ఆనందం క్షణాల్లో ఆవిరైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ వార్త సంచలనంగా మారింది.

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

వివరాల్లోకెళ్తే.. ఉత్తర ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కుటుంబంతో కలిసి ఈత కొడుతుండగా 12 ఏళ్ల బాలికను ఓ భారీ సైజు మొసలి సజీవంగా మింగేసింది. అనంతరం ఆ 14 అడుగుల పొడవైన భారీ మొసలిని కాల్చి చంపారు పోలీసులు. ఈ ఘటన జూలై మొదటి వారంలో చోటు చేసుకుంది. ఈత కొడుతోన్న బాలిక హఠాత్తుగా మాయం కావడంతో.. ఆ కుటుంబం కంగారుపడి స్థానిక అధికారులకు సమాచారం అందించింది. వారంతా చుట్టుప్రక్కల సెర్చ్ ఆపరేషన్ చేయగా.. చివరికి నీటి అడుగున ఉన్న ఓ భారీ మొసలి చుట్టూ రక్తపు మడుగులా కనిపించింది. ఆ బాలికను మొసలి చంపి తినేసిందని గుర్తించిన పోలీసులు. దాన్ని కాల్చి చంపేశారు. 2018 తర్వాత ఉత్తర ఆస్ట్రేలియాలో మొసలి దాడికి మనిషి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే మొదటిది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

అలాగే 2018లో నదిలో మస్సెల్స్‌ను సేకరిస్తున్న స్థానిక మహిళను మొసలి చంపి తినేసింది. ఈ ప్రాణాంతక దాడి ఉత్తర భూభాగంలో మొసళ్ల దాడిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రేరేపించింది. ఉత్తర ఆస్ట్రేలియా అవుట్‌బ్యాక్‌లోని స్థానిక కమ్యూనిటీ పలుంప సమీపంలోని మాంగో క్రీక్ వద్ద గత వారం పైన పేర్కొన్న 12 ఏళ్ల బాలికపై మొసలి దాడి చేసింది. ఇక అప్పటి నుంచి మొసలిని ట్రాప్ చేసేందుకు లేదా చంపేందుకు రేంజర్లు ప్రయత్నిస్తూ వచ్చారు. ఆఖరికి స్థానిక ల్యాండ్ ఓనర్ల అనుమతితో దాన్ని కాల్చి చంపారు. కాగా, చాలామంది స్థానిక ఆస్ట్రేలియన్లు ఉప్పునీటి మొసళ్లను టోటెమ్‌లుగా పరిగణిస్తారు. బాలికను చంపిన మొసలి కూడా ఇదేనని పోలీసులు అన్నారు.

ఇది చదవండి: ఆడది కాదు.. ఆడపులి.! ఒంటిచేత్తో భారీ కొండచిలువను ఎలా ఉడుంపట్టు పట్టిందో చూస్తే

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి