మేడి చెట్టు నుంచి కల్లు.. ఎగబడుతున్న జనం !!

మనం తాటికల్లు... ఈతకల్లు... ఆఖరికి కొబ్బరి చెట్టు కల్లు కూడా చూశాం. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కొత్తరకం కల్లు వచ్చి చేరింది. ఈ కొత్తరకం కల్లు కోసం జనం ఎగబడుతున్నారు. అదే మేడి కల్లు.. మీరు విన్నది నిజమే. మేడి చెట్టునుంచి కల్లు వస్తోంది. ఈ కల్లు తాగేందుకు జనం పోటీపడుతున్నారు నాగర్‌ కర్నూలు జిల్లా కొత్తపలి గ్రామ ప్రజలు. జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.

మేడి చెట్టు నుంచి కల్లు.. ఎగబడుతున్న జనం !!

|

Updated on: Jul 11, 2024 | 12:31 PM

మనం తాటికల్లు… ఈతకల్లు… ఆఖరికి కొబ్బరి చెట్టు కల్లు కూడా చూశాం. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కొత్తరకం కల్లు వచ్చి చేరింది. ఈ కొత్తరకం కల్లు కోసం జనం ఎగబడుతున్నారు. అదే మేడి కల్లు.. మీరు విన్నది నిజమే. మేడి చెట్టునుంచి కల్లు వస్తోంది. ఈ కల్లు తాగేందుకు జనం పోటీపడుతున్నారు నాగర్‌ కర్నూలు జిల్లా కొత్తపలి గ్రామ ప్రజలు. జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నరేందర్ అనే వ్యక్తి పెరట్లో మేడి చెట్టు ఉంది. దాని నుంచి నురగతో కూడిన కల్లులాంటి ద్రవ పదార్ధం వస్తోంది. ఇది గమనించి.. అది కల్లేనని భావించిన గీత కార్మికుడు శివగౌడ్ మేడిచెట్టుకు కల్లు గీయడం ప్రారంభించాడు. మొదట్లో ప్రతిరోజు రెండు బిందెల కల్లు వచ్చేది. ప్రస్తుతం ఉదయం పది లీటర్లు, సాయంత్రం పది లీటర్ల కల్లు వస్తోంది. అయితే ఈ మేడికల్లు ఏంటి అని మొదట్లో అశ్చర్యంగా చూసిన జనం.. మేడి కల్లు రుచి నచ్చడంతో తెగ తాగేస్తున్నారు. అంతేకాదు, ఈ మేడికల్లు ఆరోగ్యానికి మంచిదని అనేక రోగాలు నయమవుతాయని చెబుతున్నారు స్థానికులు. కాళ్ల నొప్పులు, నరాల బలహీనతలాంటి సమస్యలు ఉన్నవారు ఈ కల్లు తాగిన తర్వాత తమకు ఆరోగ్యం బాగుంది అంటున్నారు. ఇక ఈ మేడికల్లు గురించి ఆనోటా ఈనోటా చుట్టు పక్కల గ్రామాలకు కూడా పాకడంతో వారు కూడా మేడికల్లు కోసం పక్కగ్రామానికి క్యూకడుతున్నారు. దీంతో చిన్నకొత్తపల్లి గ్రామం మేడికల్లు కు హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. బాటిల్స్ లో కల్లును కొనుక్కొని తీసుకెళ్తున్నారు. దీంతో మేడికల్లుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మేడిచెట్టు కల్లును లీటర్ రూ.50 లకు విక్రయిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి 3E, EA ఏంటి ??

Kalki 2898 AD: బిగ్ న్యూస్.. బయటికి వచ్చిన కల్కి OTT స్ట్రీమింగ్ డేట్‌

హీరోయిన్‌కు చేదే అనుభవం.. బికినీ వేసుకోలేదని ఫోటోగ్రాఫర్ సీరియస్

Darshan: బిగుస్తోన్న ఉచ్చు.. దారుణంగా హీరో పరిస్థితి ??

Indian 2: భారతీయుడు2 పై మర్మకళ వివాదం రిలీజ్‌ అవుతుందా ?? లేదా ??

Follow us
స్టూడెంట్స్‌కు ఏం సందేశం ఇస్తున్నారు ? అమలాపాల్ పై ట్రోలింగ్
స్టూడెంట్స్‌కు ఏం సందేశం ఇస్తున్నారు ? అమలాపాల్ పై ట్రోలింగ్
అందుకే మోనోపాజ్‌ తర్వాత మహిళల్లో గుండె జబ్బులు ఎక్కువ
అందుకే మోనోపాజ్‌ తర్వాత మహిళల్లో గుండె జబ్బులు ఎక్కువ
తెలంగాణ బడ్జెట్‌లో ఏం లేదు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
తెలంగాణ బడ్జెట్‌లో ఏం లేదు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
ఇంట్లో ఈగలను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు మీ కోసం
ఇంట్లో ఈగలను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు మీ కోసం
ఛత్రపతి నటుడు భార్య గురించి తెలుసా.? ఆమె చాలా ఫేమస్ నటి
ఛత్రపతి నటుడు భార్య గురించి తెలుసా.? ఆమె చాలా ఫేమస్ నటి
ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే.. ఆ పరీక్షలకు ఉచిత తరగతులు
ఈయన శిక్షణ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్లే.. ఆ పరీక్షలకు ఉచిత తరగతులు
యూనివర్శల్‌ స్టార్ గా ప్రభాస్.. అందుకే దేశందాటి తెచ్చుకుంటున్నారు
యూనివర్శల్‌ స్టార్ గా ప్రభాస్.. అందుకే దేశందాటి తెచ్చుకుంటున్నారు
సామ్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సామ్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
గురు పౌర్ణమి ఉత్సవాలకు శ్రీవారిని మించి షిర్డీ సాయి బాబా ఆదాయం..
గురు పౌర్ణమి ఉత్సవాలకు శ్రీవారిని మించి షిర్డీ సాయి బాబా ఆదాయం..
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!