AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

మనిషి జీవితంలో ఆహారం అనేది ఎంత ముఖ్యమైనదో.. ఆ క్రమంలోనే నిద్ర కూడా అలాంటి కీ రోల్‌నే పోషిస్తుంది. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా.. ప్రతీ ఒక్కరూ రోజుకు ఎనిమిది గంటలసేపు పడుకోవడం చాలా ముఖ్యం. లేదంటే.. వారికి రోజు మొత్తంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి.

నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా
Sleeping Patterns
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 10, 2024 | 12:00 PM

మనిషి జీవితంలో ఆహారం అనేది ఎంత ముఖ్యమైనదో.. ఆ క్రమంలోనే నిద్ర కూడా అలాంటి కీ రోల్‌నే పోషిస్తుంది. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా.. ప్రతీ ఒక్కరూ రోజుకు ఎనిమిది గంటలసేపు పడుకోవడం చాలా ముఖ్యం. లేదంటే.. వారికి రోజు మొత్తంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. మరి మన ఆరోగ్యంలో ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్న నిద్ర గురించి పలు ఆసక్తికర విషయాలు మీకు తెల్సా.? మనం నిద్రపోయే భంగిమను బట్టి.. మన వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చునట. సాధారణంగా ప్రతీ ఒక్కరూ ఒకే విధానంలో నిద్రపోరు. కొందరు వెల్లికల్లా పడుకుంటే.. మరికొందరు బోర్లా.. ఇంకొందరు ఎడమవైపునకు తిరిగి.. అలాగే మరికొందరు కుడివైపునకు తిరిగి.. కాళ్లు ముడుచుకుని ఒకరైతే.. తల కింద చెయ్యి పెట్టు మరొకరు.. ఇలా ఎవరికి.. వారికే నిద్రపోయేటప్పుడు సెపరేట్ భంగిమలు ఉంటాయి. మరి వాటి ద్వారా వారి వ్యక్తిత్వాలను చెప్పొచ్చునని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

పక్కకు తిరిగి కాళ్లు ముడుచుకుని పడుకుంటే..

ఇలా పడుకునేవారు చాలా కష్టపడి పనిచేస్తారట. అలాగే వీరు చాలా సెన్సిటివ్.. చిన్న చిన్న విషయాలకే తెగ బాధపడిపోతుంటారు. అలాగే వీరిలో అసంతృప్తి కూడా ఎక్కువే. ఇక కుడిచెయ్యి తలకింద పెట్టు.. కుడివైపునకు తిరిగి పడుకునేవారి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుందట. వీరి ఎంచుకునే పనుల్లో విజయం సాధించడమే కాదు.. అందరూ వెళ్లే మార్గంలో కాకుండా సెపరేట్ రూట్‌లో వెళ్లేందుకు ట్రై చేస్తుంటారు. వీరికి అధికారం, డబ్బు దండిగా ఉంటాయి. మరోవైపు ఎడమ చెయ్యి తలకింద పెట్టుకుని.. ఎడమవైపునకు తిరిగి పడుకునేవారికి మంచి గుణాలు ఎక్కువ. పెద్దలను గౌరవిస్తారు. పనిలో నిబద్దత ఉంటుంది. అయితే ఆత్మవిశ్వాసం మాత్రం తక్కువ. ఇక వీరిలో ఓ స్పెషల్ ఎట్రాక్షన్ క్రియేటివిటీ.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

వెల్లికల్లా పడుకునేవారు, బోర్లా పడుకునేవారు..

వెల్లికల్లా పడుకునేవారికి ఎక్కువ స్వేఛ్చ ఉంటుందట. వారు ఫ్రీ-బర్డ్ అని చెప్పొచ్చు. అలాగే వీరు నలుగురిలోనూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఇక బోర్లా పడుకునేవారు సంకుచిత స్వభావం కలిగి ఉంటారు. అవసరమైతేనే ఇతరులతో మాట్లాడతారు. ప్రతీ పనిలోనూ అలసత్వం, ఎలాంటి లక్ష్యం లేకపోవడం వీరి స్వభావం. ఒకవైపునకు తిరిగి రెండు కాళ్లు ముడుచుకుని పడుకునేవారు స్వార్ధపరులట. అంతేకాకుండా వీరిలో అసూయ, పగ, ప్రతీకారాలు ఎక్కువ. ఇక ఇలాంటి వారు ప్రతీ పనిని చూసి భయపడటమే కాదు.. దానికి దూరంగా పారిపోతారు. అలాగే వీరు త్వరగా ఇతరుల దగ్గర మోసపోతారు కూడా.

ఇది చదవండి: ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. లక్షల్లో డబ్బు.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..