Viral Video: ఆ టాలెంట్‌కు పోలీసులైనా అలా చూస్తుండిపోవాల్సిందే… సోషల్ మీడియాలో మహిళ డ్యాన్స్ వైరల్
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తమ టాలెంట్‌ను ప్రపంచం ముందు ఆవిష్కరించడానికి సోషల్ మీడియా అనేది ఓ సాధనంగా మారిపోయింది. పురుషులే కాదు మహిళలు సైతం రీల్స్ పోటీలో దూసుకెళుతున్నారు. కొందరు మగవారు కూడా షాక్ అయ్యేలా మహిళలు...

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ రోడ్డుపై డాన్స్ చేసింది. రోడ్డుపై డాన్స్ చేయడంతో షాక్ అవడానికి ఏముందీ అనేగా మీ సందేహం. రోడ్డుపై డాన్స్ చేసి ఉంటే అంత చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు.. కానీ ఆమె రోడ్డుపై పోలీసు వాహనం ఎదురుగా రీల్ చేసింది.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తమ టాలెంట్‌ను ప్రపంచం ముందు ఆవిష్కరించడానికి సోషల్ మీడియా అనేది ఓ సాధనంగా మారిపోయింది. పురుషులే కాదు మహిళలు సైతం రీల్స్ పోటీలో దూసుకెళుతున్నారు. కొందరు మగవారు కూడా షాక్ అయ్యేలా మహిళలు టాలెంట్‌తో అదరగొడుతున్నారు. ఇక ఫేమస్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న మరికొందరు మాత్రం రోడ్ల మీదకు వచ్చి రచ్చ రేపుతుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ నడి రోడ్డుపై పోలీసు వాహనం ముందు డాన్స్ ఇరగదీసింది. ఇది చూసినవారంతా షాక్ అవుతున్నారు.
వీడియో చూడండి:
Leave stray dogs, arrest these Reelers 🤣 #SupremeCourt
— V🐧 (@Vtxt21) August 22, 2025
పోలీసులు చూస్తున్నా కూడా ఏ మాత్రం బిడియం, భయం లేకుండా డాన్స్ అదరగొట్టింది. ఈమె డాన్స్ చేస్తుండగా పోలీసులు కూడా అలా చూస్తుండిపోయారు. అయితే ఈమెతో ఎందుకొచ్చిన సమస్య అని అనుకున్నారేమో గానీ.. అలా చూస్తుండిపోయారు తప్ప ఆమెను వారించే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయింది. చాలా సేపు అలాగే డాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు భిన్నంగా స్పదిస్తున్నారు. ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
