AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఓరి దేవుడా.. ఇదేం చిత్రం.. నారింజ రంగులో సొర చేప.. అరుదైన రూపం ఎలా వచ్చిందంటే..

సృష్టిలో అనేక చిత్ర విచిత్రమైన జీవులున్నాయి. వాటిని చూసినప్పుడు సృష్టి లో ప్రకృతి ఎంతో అందమైనది అనిపిస్తుంది ఎవరికైనా.. ఈ అందమైన ప్రకృతిలో భూమి, ఆకాశం, నీరులో అనేక వింతలు కనిపిస్తూ కనువిందు చేస్తాయి. తాజాగా కోస్టా రికాకు చెందిన మత్స్యకారులు ఒక వింత సొరచేపను పట్టుకున్నారు. దానిని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ చేప చర్మం పూర్తిగా నారింజ రంగులో ఉంది.. దాని కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి.

Viral News: ఓరి దేవుడా.. ఇదేం చిత్రం.. నారింజ రంగులో సొర చేప.. అరుదైన రూపం ఎలా వచ్చిందంటే..
Orange Shark
Surya Kala
|

Updated on: Aug 23, 2025 | 5:35 PM

Share

సముద్రంలో ఊహించడానికి కూడా కష్టమైన అనేక జీవులున్నాయి. ఇటీవల కోస్టా రికాకి చెందిన ఒక జాలరి ఒక వింత చేపని చూశాడు. దీనిని చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి ఈ జాలర్ల బృందం వారి వలలో చాలా అరుదైన సొరచేప పడింది. అది సాధారణ సొరచేప కాదు.. ప్రకాశవంతమైన నారింజ రంగు సొరచేప. దాని కళ్ళు పాలులా తెల్లగా ఉన్నాయి. అది ఒక మర్మమైన జీవిలా కనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందు ఎవరూ ఇలాంటి సొరచేపను చూడలేదు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సొరచేప అసాధారణ రంగు, కళ్ళు అరుదైన జన్యుపరమైన స్థితి ఫలితంగా ఉన్నాయి. వాస్తవానికి ఈ సొరచేపలో రెండు వేర్వేరు పరిస్థితుల లక్షణాలు అంటే జాంటిజం, అల్బినిజం కనుగొనబడ్డాయి. జాంటిజం అనేది శరీరంలో ఎక్కువ పసుపు వర్ణద్రవ్యం ఉత్పత్తి అయ్యే పరిస్థితి. దీని కారణంగా జంతువుల రంగు ముదురు పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తుంది. ఈ పరిస్థితి కొన్ని చేపలు, పక్షులు, సరీసృపాలలో కనిపిస్తుంది. కానీ సొరచేపలలో దీనిని కనుగొనడం దాదాపు అసాధ్యంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ ఆవిష్కరణ శాస్త్రీయ సమాజానికి ఒక అద్భుతం కంటే తక్కువ కాదు.

ఇవి కూడా చదవండి

ఇది ఒక అద్భుతం ఎందుకంటే ఈ సొరచేప తెల్ల కళ్ళు దీనికి అల్బినిజం కూడా ఉందని సూచిస్తుంది. ఇది శరీరం మెలనిన్ అనే వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేయలేని అరుదైన జన్యు పరిస్థితి. మెలనిన్ చర్మం, జుట్టు, పొలుసులు, కళ్ళకు నలుపు, గోధుమ, ఎరుపు లేదా ముదురు రంగును ఇస్తుంది. ఈ వర్ణద్రవ్యం ఉత్పత్తి కానప్పుడు శరీరం, కళ్ళు తెల్లగా లేదా లేతగా కనిపిస్తాయి. సముద్ర జంతువులలో అల్బినిజం చాలా అరుదుగా కనిపిస్తుంది. కనుక ఈ ఆవిష్కరణ మరింత ముఖ్యమైనది.

ఒకే జాతిలో జాంథిజం, అల్బినిజం కలిసి కనిపించడం చాలా అరుదు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒకే సొరచేపలో రెండు పరిస్థితుల లక్షణాలు కనుగొనబడిన మొదటి సందర్భం ఇదే కావచ్చు. అంతకుముందు, 2023లో ఒక జంట తెల్లటి డాల్ఫిన్ (అల్బినో డాల్ఫిన్)ను చూసింది. అది ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఇంత అసాధారణ రంగు ,ఆకారం కలిగిన జీవులు సముద్రంలో జీవించడం అంత సులభం కాదు. వాటి ప్రకాశవంతమైన రంగు వాటిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. వేటాడే జంతువులు వాటిని సులభంగా లక్ష్యంగా చేసుకోగలవు. ఆహారం వాటిని దూరం నుంచి చూస్తుంది. కనుక అలెర్ట్ అవుతాయి. దీంతో ఇవి తమ ఎరను పట్టుకోవడంలో కూడా ఇబ్బంది పడతాయి.

అందుకే అలాంటి షార్క్ మనుగడ సాగించడం ఒక అద్భుతం లాంటిది. ఈ నారింజ రంగు షార్క్ ఒక జాలరికి జీవితకాల అనుభవం మాత్రమే కాదు.. శాస్త్రానికి కూడా గొప్ప ఆవిష్కరణ. ఇటువంటి జీవులు సముద్ర జీవవైవిధ్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ప్రకృతి ప్రత్యేకమైన రూపాల్లో జీవులను ఎలా సృష్టిస్తుందో తెలియజేస్తుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..