AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinakaya Chavithi: వృత్తి, వ్యాపర, ఉద్యోగాల్లో సమస్యలా.. వినాయక చవితి రోజున దర్భ గడ్డితో ఈ పరిహారం చేసి చూడండి.. విశేష ఫలితం మీ సొంతం..

విఘ్నాలకథిపతి వినాయకుడికి వారంలోని బుధవారం అంకితం చేయబడిన రోజు. అంతేకాదు బుధ గ్రహానికి కూడా సంబంధించిన రోజు. ఈ రోజున చేసే పూజ గణపతితో పాటు బుధుడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని విశ్వాసం. అటువంటి బుధవారం రోజున ఈ ఏడాది వినాయక చవితి పండగ వచ్చింది. దీంతో ఈ ఏడాది చవితి పండగకు మరింత విశిష్టత ఏర్పడింది. ఈ రోజున గణేశుడికి దర్భలతో పూజ చేయడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు. ఈ రోజు వినాయక చవితి రోజున దర్భని సమర్పిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

Vinakaya Chavithi: వృత్తి, వ్యాపర, ఉద్యోగాల్లో సమస్యలా.. వినాయక చవితి రోజున దర్భ గడ్డితో ఈ పరిహారం చేసి చూడండి.. విశేష ఫలితం మీ సొంతం..
Lord Ganesha Puja
Surya Kala
|

Updated on: Aug 23, 2025 | 3:29 PM

Share

హిందూ మతంలో బుధవారం ఏ పనిలోనైనా అడ్డంకులు రాకుండా చేసే గణేశుడిని పూజించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గణపతి బప్పాను పూజించడం ద్వారా జీవితంలోని అన్ని అడ్డంకులు, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. అటువంటి విశిష్టమైన బుధవారం ఈ ఏడాది గణపయ్య జన్మ దినోత్సవం వచ్చింది. దీంతో ఈ ఏడాది వినాయక చవితి ఆగష్టు 27వ తేదీ బుధవారం జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో గణపతికి దర్భ గడ్డిని సమర్పించడం వలన కలిగే ఫలితాలు శాస్త్రాలలో ప్రస్తావించబడింది. గణేశుడుకి దర్భ అంటే చాలా ఇష్టం. ఎవరైనా భక్తితో గణపతికి దర్భాలతో చేసిన దండను సమర్పిస్తే, అతని కోరికలు త్వరలో నెరవేరుతాయని చెబుతారు.

వినాయక చవితి బుధవారం రోజున 21 లేదా 108 ముడులు కలిగిన దర్భ గడ్డి మాలను సమర్పించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.

దర్భని సమర్పించడం వలన కలిగే ప్రయోజనాలు

గణేశుడికి దూర్వాను సమర్పించడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

ఇంట్లో ,కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు , శాంతి నెలకొంటాయి.

వ్యాపారం, ఉద్యోగం, చదువులలో విజయం సాధిస్తారు.

మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతికూల శక్తి నశిస్తుంది.

బుధ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. తెలివి, వివేకం , వాక్కుపై నియంత్రణ లభిస్తుంది.

వినాయక చవితి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత.. పూజ చేసే సమయంలో నిర్మలమైన మనస్సుతో గణేశుడి విగ్రహం లేదా చిత్రం ముందు కూర్చోండి. 21 లేదా 108 దర్భలతో ఒక దండను తయారు చేసి గణేశుడికి సమర్పించండి.

“ఓం గణగణపతయే నమః” అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయండి.

ఈ ఏడాది వినాయక చవితి బుధవారం రోజున గణేశుడికి దర్భలతో తయారు చేసిన మాల సమర్పించడం వలన భక్తుడు చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగి పోయి.. అదృష్టం సొంతం అవుతుంది. అంతేకాదు బుధ గ్రహం నుంచి ఉపశమనం లభించి.. సంపద, జ్ఞానం, శ్రేయస్సు అనే ఆశీర్వాదాలు లభిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ