AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చీపురుతో పోస్టాఫీసు దుమ్ము దులిపిన సింధియా… వైరల్‌గా మారిన ఎంపీ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ వీడియో

సంచలనాల కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరోమారు వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా చీపురు పట్టుకుని రంగంలోకి దిగారు. దుమ్ము, దూళితో నిండిన పోస్టాఫీసును ఊడ్చిపడేశారు. మధ్యప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ నియోజకవర్గంలోదీ దృశ్యం. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హఠాత్తుగా చీపురు పట్టుకుని ప్రత్యక్షమై అందరినీ...

Viral Video: చీపురుతో పోస్టాఫీసు దుమ్ము దులిపిన సింధియా... వైరల్‌గా మారిన ఎంపీ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ వీడియో
Jyotiraditya Scindia Cleani
K Sammaiah
|

Updated on: May 20, 2025 | 2:44 PM

Share

సంచలనాల కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరోమారు వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా చీపురు పట్టుకుని రంగంలోకి దిగారు. దుమ్ము, దూళితో నిండిన పోస్టాఫీసును ఊడ్చిపడేశారు. మధ్యప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ నియోజకవర్గంలోదీ దృశ్యం. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హఠాత్తుగా చీపురు పట్టుకుని ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. సింధియా పోస్టాఫీసును శుభ్రం చేస్తున్న వీడియో నెట్టింట వైల్‌గా మారింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో, సింధియా గుణ సీటు నుండి కాంగ్రెస్ అభ్యర్థి రావు యాదవేంద్ర సింగ్ యాదవ్‌ను ఐదు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడించి గెలిచారు.

జ్యోతిరాదిత్య సింధియా శివపురి-అశోక్‌నగర్ ప్రాంతంలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. సోమవారం, సింధియా గుణ నుండి 65 కి.మీ దూరంలో ఉన్న ఇసాగర్ పోస్టాఫీసును సందర్శించారు. పోస్టాఫీసు దుమ్ము దూళితో ఉండటాన్ని గమనించారు. వెంటనే చీపురు పట్టుకున్నారు. క్లీన్‌ చేయడం మొదలు పెట్టారు. తొలుత పోస్టాఫీసు దుమ్ము పట్టి ఉండటంపై సిబ్బందిని ప్రశ్నించారు. ఎందుకు శుభ్రంగా ఉంచుకుంటలేరని ఆరా తీశారు.

వీడియో చూడండి:

అయితే, పోస్టాఫీసు సిబ్బంది జవాబుతో అసంతృప్తి చెందిన ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. చీపురు పట్టి శుభ్రం చేయడం ప్రారంభించారు. చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను కూడా కేంద్ర మంత్రి అక్కడే పద్దతిగా సర్దారు.

ఆ తర్వాత కేంద్ర మంత్రి పోస్టాఫీసులోని అధికారులను పరిశుభ్రతను కాపాడుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన శివపురి జిల్లాలోని బదర్వాస్ నగర్ పరిషత్‌లో కొత్త అగ్నిమాపక దళ వాహనాన్ని ప్రారంభించారు. ఆయన అగ్నిమాపక దళ వాహనాన్ని కూడా నడిపారు. నైనాగిర్ గ్రామంలో, ఆయన కొత్తగా నిర్మించిన వంతెనను ప్రారంభించారు. అనంతరం మహాసభలో ప్రసంగించారు.