పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో భద్రతను పటిష్టం చేసేందుకు పోలీసులు అత్యాధునిక ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌ను ఉపయోగిస్తున్నారు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో, ఈ కళ్లద్దాలు ముఖ గుర్తింపు సాంకేతికతతో నేరస్థుల డేటాబేస్‌కు అనుసంధానమై గత నేరగాళ్లను, అనుమానితులను తక్షణమే గుర్తిస్తాయి. థర్మల్ ఇమేజింగ్ ద్వారా నిషేధిత ఆయుధాలను కూడా పసిగడతాయి. తద్వారా మాన్యువల్ తనిఖీలను తగ్గించి, క్షణాల్లో అనుమానితులను గుర్తించి, ప్రజల గందరగోళాన్ని నివారించి, పబ్లిక్ సేఫ్టీని మెరుగుపరుస్తుందని ఢిల్లీ పోలీసులు వివరించారు.
రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో ఉగ్రదాడులకు పాక్ వ్యూహ రచన చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు అలర్టయ్యారు. ఈసారి నిందితులు, బాంబులను గుర్తించడానికి ఏఐ గ్లాసెస్ పెట్టుకోనున్నారు. ఏఐ ఏం చేస్తుందంటే.. క్షణాల్లో ఎవరు ఉగ్రవాదో ఎవరు నేరస్తుడో చెప్పేస్తుంది. ఫేషియల్ రికగ్నీషన్ తో పనిచేసే స్మార్ట్ కళ్లద్దాలను నేరాల డేటాబేస్‌తో అనుసంధానిస్తారు. దాంతో వేడుకకు హాజరైన వాళ్లలో గత నేరగాళ్ల ముఖాలను గుర్తించి వెంటనే హెచ్చరిస్తుంది. తద్వారా పాత నేరస్తులు, నిందితులు, అనుమానిత వ్యక్తులను తక్షణం అదుపులోకి తీసుకునే వీలుంటుంది. కార్యక్రమాలకు హాజరైన గుమిగూడిన జనంలోని వారిలో ఎవరి ముఖమైనా నేరచరితుల డేటాతో సరిపోలితే స్మార్ట్‌గ్లాస్ వెంటనే అప్రమత్తం చేస్తుంది. దాంతో జనం గందరగోళానికి గురికాకుండా కేవలం అనుమానితుడ్ని మాత్రమే జాగ్రత్తగా అదుపులోకి తీసుకోవచ్చని న్యూఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ దేవేశ్ కుమార్ మాహ్లా వివరించారు. ఏఐ స్మార్ట్‌గ్లాస్ పోలీస్ స్మార్ట్‌ఫోన్‌కు మెసేజ్ పంపుతుంది. మెసేజ్‌లో గ్రీన్ బాక్స్ వస్తే ఆ వ్యక్తికి ఎలాంటి నేరచరిత్ర లేదు అని అర్ధం. ఒకవేళ ఎరుపు రంగు వస్తే అతనికి గత నేరాలతో సంబంధం ఉందని అర్థం. వెంటనే అతని గుర్తింపు కార్డ్‌ను పరిశీలించి అదుపులోకి తీసుకోవాలా వద్దా? అతడిపై గతంలో ఉన్న నేరాభియోగాలు తీవ్రమైనవా కావా? వెంటనే అదుపులోకి తీసుకోవడం అవసరమా కాదా? అనేది పోలీసులు సెకన్లలో నిర్ణయిస్తారు. ఏఐ గ్లాసెస్‌తో ఒక్కో వ్యక్తిని మాన్యువల్‌గా తనిఖీచేయాల్సిన శ్రమ తగ్గుతుంది. తమ దగ్గర ఉన్న డేటాబేస్‌లో పాత నేరగాళ్లకు చెందిన 20 ఏళ్లక్రితం నాటి ఫొటో అయినా సరే సంబంధిత నేరస్తుడు ఇవాళ కన్పించినా ఏఐ స్మార్ట్‌గ్లాస్ గుర్తుపడుతుందని కమిషనర్ అన్నారు. అద్దాలకు థర్మల్ ఇమేజింగ్ ఉందని ఇనుము, ఉక్కుతో తయారైన కత్తుల్లాంటి నిషేధిత ఆయుధాలతో సంచరించే వ్యక్తులను గుర్తిస్తుందని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kashmir: భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
రూపాయి @ రూ 91.65.. ఎందుకీ పరిస్థితి ??
మా వేలు ట్రిగ్గర్ పైనే ఉంది.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పోలీస్ స్టేషన్‌కు చేరిన చిలక పంచాయితీ
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు

