వీరు మునగాకు తినడం మహా డేంజర్.. కష్టాల్లో కాలేసినట్లే!
Samatha
25 January 2026
మునగాకు , మునగకాయలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది వీటిని తమ ఆహారంలో చేర్చుకుంటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
మునగాకు
మునగాకులో విటమిన్స్ , మినరల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన శరీరానికి చాలా మేలు జరుగుతుంది అంటారు.
విటమిన్స్, మినరల్స్
అందుకే చాలా మంది తమ డైట్‌లో మునగాకు చేర్చుకుంటారు. అయితే మునగాకు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొందరు వీటిని తినడం అస్సలే మంచిది కాదంట.
ఆరోగ్య ప్రయోజనాలు
కాగా, అసలు ఎలాంటి సమస్యలు ఉన్నవారు మునగాకు తీసుకోకూడదు. తీసుకోవం వలన కలిగే ప్రతికూలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
సమస్యలు
థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారు అస్సలే ముగాకు తమ ఆహారంలో చేర్చుకోకూడదంట. ఇది మీ హార్మోన్ల పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
థైరాయిడ్
మునగాకులో ఎక్కువ మొత్తంలో అల్కలాయిడ్లు ఉంటాయి. అందువలన రక్తపోటు సమస్యతో బాధపడే వారు కూడా అస్సలే మునగాకు తీసుకోకూడదంట.
రక్తపోటు
గర్భిణీ స్త్రీలు కూడా ముగాకు తమ డైట్‌లో చేర్చుకోకూడదు. కొన్ని సార్లు ఇది గర్భస్రావానికి దారితీసే ఛాన్స్ ఉన్నదంట. అందుకే వైద్యుడిని సంప్రదించి తీసుకోవడం మంచిది.
గర్భిణీలు
అలాగే, విరేచనాల వంటి సమస్యతో బాధపడే వారు కూడా మునగాకును తమ ఆహారంలో చేర్చుకోకూడదంట. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేసే ఛాన్స్ ఉంది.